Allu Aravind- Balakrishna: ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ది ప్రత్యేక శైలి. ఆయన సినిమాలు కూడా అదే విధంగా ఉంటాయి. చిత్ర నిర్మాణంలో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న నిర్మాతగా అల్లు అరవింద్ కు పేరుంది. స్టార్ ప్రొడ్యూసర్ గా ఎన్నో సినిమాలు చేసి ఔరా అనిపించుకున్నాడు. అల్లు కుటుంబానికి మెగా కుటుంబానికి ఏం జరిగిందో కానీ ఇటీవల కాలంలో ఎడమొహం పెడమొహంగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అరవింద్ బాలయ్యతో స్నేహంగా ఉంటున్నాడనేది వార్త. కానీ నిజానికి బాలయ్య తో అరవింద్ స్నేహం ఈనాటిది కాదు. ఎన్నో ఏళ్లుగా వారు మంచి స్నేహితులైనా వారు కలుసుకునే సందర్భం రాలేదు. గీతా ఆర్ట్స్ లో కనీసం ఒక్క సినిమా కూడా బాలయ్యతో చేయకపోవడమే కారణం.

ఆహాలో అన్ స్టాపబుల్ షో లో బాలయ్యను హోస్ట్ గా పిలిచి నెంబర్ వన్ గా నిలిచారు. షో సక్సెస్ కావడంతో ఇప్పుడు వీరి స్నేహం మరింత పెరిగింది. నిజానికి వారు నలభై ఏళ్లుగా మంచి మిత్రులు. కానీ ఎప్పుడు కూడా వారు కలుసుకునే సందర్భాలు రాలేదు. బాలయ్యతో అరవింద్ ఎప్పుడు సినిమా చేయకపోవడంతోనే వారి మధ్య స్నేహం లేదని అనుకుంటారు. కానీ వారు మంచి ఆప్తమిత్రులు అన్న సంగతి చాలా మందికి తెలియదు. బయట కూడా వారు ఎప్పుడు కలుసుకోకపోవడమే.
అన్ స్టాపబుల్ షో కు కావాలనే బాలయ్యను ఎంచుకున్నట్లు చెబుతున్నారు. ఇంతవరకు బాలయ్య ఏ షోలో కూడా కనిపించలేదు. దీంతో ఆయనను హోస్ట్ గా చేసి షో నిర్వహించడంతో మంచి హిట్టయింది. ఫ్రెష్ గా బాలయ్య చేస్తున్న షోకు విపరీతమైన స్పందన వస్తోంది. ఈ మేరకు అల్లు అరవింద్ వేసుకున్న ప్లాన్ సక్సెస్ అయింది. ఇండియాలోనే నెంబర్ వన్ గా రేటింగ్ అందుకోవడం విశేషం. తాజాగా సెకండ్ సీజన్ రన్ అవుతోంది. గీతా ఆర్డ్స్ 2లో అరవింద్ రెండో కొడుకు శిరీష్ తో ఊర్వశివో రాక్షసివో సినిమా తీశారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు కూడా చీఫ్ గెస్ట్ గా బాలయ్య బాబు రాబోతున్నట్లు ప్రకటించారు. ఇలా బాలయ్యతో స్నేహంగా ఉంటున్న అరవింద్ ఆయనకు మరింత విలువ ఇస్తున్నారు. దీంతో మెగా ఫ్యామిలీతో ఏమై ఉంటుందనే వాదనలు కూడా పరిశ్రమలో వస్తున్నాయి. చిరంజీవిని కాదని బాలయ్యతో స్నేహం చేస్తున్న అరవింద్ అసలు విషయం ఏముంటుందనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. ఇన్నాళ్లు బావతోనే చేయించుకున్న అరవింద్ ప్రస్తుతం బాలయ్యతో తిరగడం చిరు అభిమానుల్లో సందేహాలు వస్తున్నాయి.

త్వరలో బాలయ్యతో ఓ సినిమా కూడా ప్లాన్ చేసినట్లు సమాచారం. దీనికి బింబిసార దర్శకుడు వశిష్టను ఎంచుకున్నట్లు చెబుతున్నారు. అతడికి డబ్బులు కూడా అడ్వాన్సు గా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో బాలయ్య అరవింద్ కాంబినేషన్ లో ఓ మంచి సినిమా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గీతా ఆర్ట్స్ లో బాలయ్య సినిమా ఎలా ఉంటుందనే దానిపై అందరికి ఉత్కంఠ కలుగుతోంది. అరవింద్ మంచి అభిలాష ఉన్న నిర్మాత కావడంతో సినిమా కూడా బాగుంటేనే ఆయన ముందుకు వస్తారనే కామెంట్లు కూడా వస్తున్నాయి.