Balakrishna- NTR: యమలోకం బ్యాక్ డ్రాప్ మీద టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి..ఇప్పటి వరుకు ఈ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి..అయితే ఇలాంటి బ్యాక్ డ్రాప్ సినిమాలు తియ్యడానికి ప్రేరణ మాత్రం నందమూరి తారక రామారావు నటించిన ‘యమగోల’ సినిమా మాత్రమే..1977 వ సంవత్సరం లో తెరకెక్కిన ఈ చిత్రం ఒక ప్రభంజనం సృష్టించింది..ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలన్ని బ్లాక్ బస్టర్ హిట్స్..ఇప్పటికి ఆ పాటలు మనకి వినిపిస్తూనే ఉంటాయి..’ఓలమ్మి తిక్కరేగిందా’, ‘చిలకకొట్టుడు కొడితే చిన్నదాన’,’గుడివాడ ఎల్లాను, గుంటూరు పోయాను’ వంటి పాటలను మన తెలుగోళ్లు ఇప్పట్లో మర్చిపోలేరు..అయితే ఈ సినిమాని తెరకెక్కించే ముందు ఆ చిత్ర దర్శకుడు తాతినేని రామారావు గారికి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది..అదేమిటి అంటే ఈ సినిమాని తొలుత నందమూరి బాలకృష్ణ ని హీరో గా పెట్టి, యముడి పాత్రలో ఎన్టీఆర్ ని అనుకున్నారట..అప్పట్లో ఎన్టీఆర్ ముందు ఈ విషయం ఉంచితే ఆయన వెంటనే ఈ ఐడియా కి ఒప్పుకున్నారు.

అప్పటిలోకి బాలయ్య బాబు కేవలం నాలుగు సినిమాల్లో మాత్రమే నటించాడు..అవి కూడా హీరో గా కాదు..బాలనటుడిగా ఒక సినిమా మరియు క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎన్టీఆర్ నటించిన సినిమాలో నటించి ఉన్నాడు..ఈ సినిమా ద్వారా హీరో గా మొదటి సినిమా చెయ్యాలనుకున్నాడు డైరెక్టర్ తాతినేని రామారావు..కానీ ఎన్టీఆర్ లాంటి మహానటుడు ఎదురుగ నిలబడి డైలాగ్స్ చెప్పలేనని..మొదటి సినిమానే అలాంటి పాత్ర నావల్ల కాదని తప్పుకున్నాడట బాలయ్య బాబు..ఆ తర్వాత కొంతమంది హీరోలను అనుకున్నారు..కానీ ఎన్టీఆర్ ఒప్పుకోలేదు..హీరో గా తానే నటిస్తాను అని చెప్పి ప్రముఖ నటుడు కైకాల సత్యనారాణయన గారిని యముడి పాత్రలో తీసుకొని ఈ సినిమా ప్రారంబించారు.
Also Read: Mahesh Babu- Trivikram: మహేష్ సినిమాలో మరో హీరో.. త్రివిక్రమ్ ప్లాన్ అదిరింది

అంతే విడుదలైన తర్వాత ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనాల గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది..ఆరోజుల్లో కోటి రూపాయిల వసూలు చేసిన నాల్గవ చిత్రం గా సరికొత్త చరిత్ర సృష్టించింది ఈ సినిమా..మిగిలిన మూడు సినిమాలు కూడా ఎన్టీఆర్ వే అవ్వడం విశేషం..లవ కుశ, అడవి రాముడు మరియు దాన వీర సూర కర్ణ వంటి చిత్రాలు కోటి రూపాయిల షేర్ ని వసూలు చేసాయి..ఆ జాబితోలికి యమగోల సినిమా కూడా చేరిపోయింది..28 సెంటర్స్ లో 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం..7 కేంద్రాలలో 175 రోజులు ఆడింది.
Also Read:Naresh-Pavitra Lokesh: మరోసారి అడ్డంగా బుక్కైన నరేష్-పవిత్రా లోకేష్
[…] […]
[…] […]