Balakrishna Anil Ravipudi Movie: టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలయ్య బాబుతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే, అనిల్.. బాలయ్య సినిమా పై తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇన్ డైరెక్ట్ గా ఓ క్లూ ఇచ్చాడు. ఈ సినిమాలో కీలక పాత్రలో మరో హీరో కూడా కనిపించబోతున్నాడు. అయితే, ఆ హీరోతో అనిల్ గతంలో ఓ సినిమా చేశాడు. కానీ.. ఆ సినిమా అనిల్ చేయలేదు, అనిల్ తో ఆ హీరో చేయించాడు. అంటే.. అనిల్ కి మొదటి అవకాశం ఇచ్చాడు ఆ హీరో.

మరి ఈ క్లూ చాలు.. ఆ హీరో ఎవరో చెప్పడానికి. అతనే కళ్యాణ్ రామ్. అనిల్ రావిపూడి.. బాలయ్యతో చేయబోతున్న సినిమాలో కళ్యాణ్ రామ్ కోసం ఓ పాత్ర రాశాడు. ఇక అనిల్ రావిపూడి ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘బాలకృష్ణగారితో చేయబోయే సినిమాలో కామెడీ డోస్ ఉంటుంది, అయితే ఈ సినిమా పూర్తి ఎంటర్‌టైనర్ గా కాకుండా, సీరియస్ యాక్షన్ డ్రామాగానే ఉంటుంది.
ఇక బాలయ్య గారిని కొత్త తరహాలో చూపించబోతున్నాము. జూలై నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. అనిల్ రావిపూడి – బాలయ్య బాబు లాంటి క్రేజీ కలయికలో సినిమా అంటే ఆ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. ఏది ఏమైనా తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కి ఫుల్ డిమాండ్ ఉంది.
మరోపక్క ‘అఖండ’తో బాక్సాఫీస్ దగ్గర ‘నటసింహం’ కలెక్షన్ల సునామీ చూపించాడు. మొత్తానికి అఖండ ఇచ్చిన అఖండమైన విజయంతో బాలయ్య తన మిగిలిన సినిమాల విషయంలో కూడా వేగం పెంచాడు. ప్రస్తుతం షార్ప్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం డేట్లు కేటాయించాడు.

నిజానికి బాక్సాఫీస్ వద్ద బాలయ్యకు అసలు రేంజ్ లేదు అని అఖండ ముందు వరకూ కొంతమంది కామెంట్స్ చేసేవారు. అయితే, ఏపీలో టికెట్ రేట్లును దారుణంగా తగ్గించినా బాలయ్య వంద కోట్ల మార్క్ ను దాటాడు. అదే పుష్పకి కలిసి వచ్చినట్లు.. టికెట్ రేట్లును రెండు వందలకు, ఐదు వందలకు అమ్ముకుని ఉండి ఉంటే.. బాలయ్య 200 కోట్ల మార్క్ ను కూడా దాటేవాడేమో.