Homeఎంటర్టైన్మెంట్Balakrishna And Vijayashanti: బాలకృష్ణతో అత్యధిక చిత్రాలు చేసిన హీరోయిన్, చివరికి విబేధాలు, కారణం ఇదే!

Balakrishna And Vijayashanti: బాలకృష్ణతో అత్యధిక చిత్రాలు చేసిన హీరోయిన్, చివరికి విబేధాలు, కారణం ఇదే!

Balakrishna And Vijayashanti: తాతమ్మ కల చిత్రంలో 1974లో బాలకృష్ణ నటుడిగా అరంగేట్రం చేశారు. సుదీర్ఘ నట ప్రస్థానంలో వందకు పైగా చిత్రాల్లో నటించాడు. ఈ క్రమంలో ఆయన నాలుగైదు తరాల హీరోయిన్స్ తో జతకట్టాడు. అయితే బాలకృష్ణ ఓ హీరోయిన్ తో అత్యధికంగా 17 చిత్రాలు చేశారు. ఆమె ఎవరో కాదు విజయశాంతి. వీరిద్దరి హిట్ కాంబినేషన్. దాంతో దర్శక నిర్మాతలు వీరి కాంబోలో చిత్రాలు చేసేందుకు ఆసక్తి చూపేవారు. 1984లో విడుదలైన కథానాయకుడు చిత్రంతో మొదటిసారి విజయశాంతి, బాలకృష్ణ జతకట్టారు. ఆ మూవీ సూపర్ హిట్ కావడంతో తర్వాత అనేక చిత్రాల్లో కలిసి నటించారు.

రౌడీ ఇన్స్పెక్టర్, లారీ డ్రైవర్ వంటి బ్లాక్ బస్టర్స్ వీరి ఖాతాలో ఉన్నాయి. విజయశాంతి అంటే బాలకృష్ణ ప్రత్యేక అభిమానం కలిగి ఉండేవారు. అనూహ్యంగా వీరి మధ్య విబేధాలు తలెత్తాయి. ఆ తర్వాత మళ్ళీ కలిసి నటించలేదు. బాలకృష్ణతో విజయశాంతి నటించిన చివరి చిత్రం నిప్పురవ్వ. 1993 సెప్టెంబర్ 3న ఈ మూవీ విడుదలైంది. విశేషం ఏమిటంటే… అదే రోజు బాలకృష్ణ నటించిన మరో చిత్రం బంగారు బుల్లోడు సైతం విడుదలైంది. అంచనాలు మాత్రం నిప్పురవ్వ మీద ఉన్నాయి.

నిప్పురవ్వ భారీ బడ్జెట్ మూవీ. అప్పట్లో ఏస్ డైరెక్టర్ గా ఉన్న ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించాడు. అందులోనూ విజయశాంతి హీరోయిన్. బంగారు బుల్లోడు చిత్రానికి రవిరాజా పినిశెట్టి దర్శకుడు. రమ్యకృష్ణ, రవీనా టాండన్ హీరోయిన్స్ గా నటించారు. అనూహ్యంగా బంగారు బుల్లోడు భారీ విజయం సాధించింది. నిప్పురవ్వ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక్కడే బాలయ్యకు విజయశాంతికి చెడిందనే వాదన ఉంది. నిప్పురవ్వ సినిమాకు విజయశాంతి పెట్టుబడి కూడా పెట్టారట. బంగారు బుల్లోడు విడుదల వాయిదా వేసి ఉంటే నిప్పురవ్వ మెరుగైన ఫలితం అందుకునేది. బంగారు బుల్లోడు సినిమా బాలయ్య అదే రోజు విడుదల చేయకుండా ఉండాల్సిందని విజయశాంతి అసహనానికి గురైందట.

దాంతో బాలయ్యతో సినిమా చేయకూడదని ఆమె ఫిక్స్ అయ్యారట. ఈ మేరకు పరిశ్రమలో ఓ పుకారు ఉంది. హీరోలకు సమానమైన ఇమేజ్ సొంతం చేసుకున్న తనకు రెమ్యూనరేషన్ ఇవ్వడం కష్టం అవుతుంది. అందుకే స్టార్ హీరోల సినిమాల్లో తనను తీసుకోవడం నిర్మాతలు మానేశారని విజయశాంతి వివరణ ఇచ్చారు. రాజకీయాల్లోకి వెళ్లిన విజయశాంతి గ్యాప్ తీసుకుంది. సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ఆమె రీ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల విడుదలైన సన్ ఆఫ్ వైజయంతి చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్ కి తల్లి పాత్ర చేయడం విశేషం.

Exit mobile version