Balakrishna And Harish Shankar: టాలీవుడ్ లో మంచి కమర్షియల్ డైరెక్టర్స్ లో ఒకరు హరీష్ శంకర్. రవితేజ షాక్ సినిమాతో వెండితెర అరంగేట్రం చేశాడు. ఆ సినిమా కమర్షియల్ గా పెద్దగా ఆడకపోయినా కూడా బాగానే తీసాడు అనే పేరొచ్చింది. ఈ చిత్రం తర్వాత ఆయన చేసిన మిరపకాయ్, గబ్బర్ సింగ్ చిత్రాలు ఇండస్ట్రీ ని షేక్ చేశాయి. ముఖ్యంగా ‘గబ్బర్ సింగ్’ అయితే ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పింది. ఇక తర్వాత ఆయన తెరకెక్కించిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గడ్డలకొండ సూపర్ హిట్స్ గా నిలిచాయి. హరీష్ శంకర్ సినిమా అంటే మినిమం గ్యారంటీ అనే రేంజ్ లో ఉంటుందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కలిగింది. కానీ ఎప్పుడైతే ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం విడుదలైందో, అప్పటి నుండి హరీష్ శంకర్ పై ప్రేక్షకుల్లో ఉన్న నమ్మకం మొత్తం పోయింది. రవితేజ హీరో గా నటించిన ఈ సినిమా దారుణమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.
స్టోరీ, స్క్రీన్ ప్లే రైటింగ్ లో ఒక సినిమాని ఎలా తియ్యకూడదు అని చెప్పడానికి ఉదాహరణ గా ఈ చిత్రాన్ని తీసుకోవచ్చు, అంత చెత్త సినిమా అది. అలాంటి సినిమా తర్వాత హరీష్ శంకర్ నుండి రాబోతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఈ సినిమా మీదనే హరీష్ శంకర్ కెరీర్ ఆధారపడుంది. మార్చి 26 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా సంగతి కాసేపు పక్కన పెడితే, మరోపక్క హరీష్ శంకర్ మరో క్రేజీ ప్రాజెక్ట్ ని సెట్ చేసుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే, రీసెంట్ గానే హరీష్ శంకర్ నందమూరి బాలకృష్ణ ని కలిసి ఒక పవర్ ఫుల్ స్టోరీ ని వినిపించాడట. ఇది బాలయ్య కి తెగ నచ్చేసింది .
ముందుగా ఈ చిత్రాన్ని KVN సంస్థ నిర్మించాలని భావించింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు తప్పుకోవడం తో ఇప్పుడు నాగవంశీ లైన్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది. బాలయ్య తో ఒక సినిమా చెయ్యాలని హరీష్ శంకర్ ఎన్నో రోజుల నుండి అనుకుంటూ వస్తున్నాడు. కానీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా వద్దనే గత కొన్నేళ్ల నుండి హరీష్ శంకర్ ఆగిపోవాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి కాబట్టి బాలయ్య తో సమాంతరంగా సినిమాని ప్లాన్ చేసుకున్నాడు హరీష్ శంకర్. ఈ ఏడాది చివర్లోపు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.ఈ చిత్రం సీమ బ్యాక్ ద్రోప్లోనే తెరకెక్కనుంది అట.