Balakrishna- Chiranjeevi: ఈ సంక్రాంతికి ‘పందెం కోళ్లు’ రెడీ అవుతున్నాయి. బరిలో మహా మహులు ఉండడంతో ఈ సారి పోటీ రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. ఓ వైపు మెగాస్టార్ చిరంజీవి.. మరోవైపు నటసింహం బాలకృష్ణలు ఊర మాస్ సినిమాలతో రెడీ అవుతున్నారు. ఇప్పటికే గాడ్ ఫాదర్ జోష్ లో ఉన్న చిరు.. ‘వాల్తేరు వీరయ్య’తో సంక్రాంతికి రానున్నారు. అటు ‘అఖండ’ బ్లాక్ బస్టర్ తో మంచి ఊపుమీదున్న బాలయ్య ‘వీర సింహరెడ్డి’తో ఇదే పండుగకు ఆగమనం చేయనున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ హీరోల సినిమాలు ఒకేసారి.. అదీ సంక్రాంతికి రావడం ఫ్యాన్స్, ఆడియన్స్ కు నిజంగా పెద్ద పండుగే.. అయితే ఇలా చిరు, బాలయ్య సినిమాలు ఒకేసారి రిలీజైనవి చాలానే ఉన్నాయి. ఆ సమయంలో ఒకరు విజయం సాధిస్తే.. మరొకరు ఫెయిల్ అయ్యేవారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరు తలపడుతున్నారు. ఈసారి ఎవరు గెలుస్తారో..?

గాడ్ ఫాదర్ సక్సెస్ ను దక్కించుకున్న చిరు ఏమాత్రం లేట్ చేయకుండా ‘వాల్తేరు వీరయ్య’ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగనుంది. దీనిని జనవరి 11న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు కాస్త నార్మల్ గా కనిపించిన చిరు ‘వాల్తేరు వీరయ్య’ ఊర మాస్ లెవల్లో ఉన్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. గాడ్ ఫాదర్ తరువాత ఈ మూవీ హిట్టయితే ఇక చిరు హవా కొనసాగినట్లే అవుతుంది.
అటు ‘అఖండ’ విజయంతో ఊపుమీదున్న బాలయ్య అంతే ఉత్సాహంతో ‘వీరనరసింహారెడ్డి’ చేస్తున్నాడు. ఈ సినిమాను గోపిచంద్ మలినేని మేకింగ్ చేస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ కొన్ని నెలల కిందటే రిలీజ్ చేశారు. అప్పటి నుంచి దీనిపై ఫ్యాన్స్ బాగా ఆశలు పెట్టుకున్నారు. ఇందులో బ్లాక్ షర్ట్, వైట్ లుంగీలో ఉన్న బాలయ్య ను చూస్తే భారీ యాక్షన్ తో కూడుకున్న మూవీనే అని అర్థమవుతుంది. ‘వీరసింహారెడ్డి’ని జనవరి 12 థియేటర్లోకి రానున్నట్లు ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్లో ఉంది. దీంతో ఫ్యాన్స్ పండుగ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.

అసలు విషయమేంటంటే.. ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్సే నిర్మిస్తుంది. ఏ సినిమా ప్లాప్ అయినా.. సక్సెస్ అయినా ఆ క్రెడిట్ అంతా మైత్రీ మూవీ మేకర్స్ దే అవుతుంది. మరోవైపు ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య అప్పుడే సోషల్ వార్ మొదలైంది. సోషల్ మీడియా వేదికగా సంక్రాంతి బరిలో తమ హీరో.. అంటే తమ హీరో గెలుస్తాడని పోస్టులు పెడుతున్నారు. మరి చూద్దాం.. చివరి వరకు ఎవరు విన్నరో..?