
Balakrishna Akhanda: బాలయ్య (Balayya) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. నేటి నుంచి ‘అఖండ’ సంగీతం జాతర మొదలైంది. ‘అడిగా అడిగా’ అంటూ సాగే ఈ సినిమా ఫీల్ గుడ్ మెలోడి సాంగ్ కి సంబంధించిన బిజియమ్ ప్రోమోను చిత్రబృందం తాజాగా రిలీజ్ చేసింది. ఈ మ్యూజిక్ ప్రోమో నెటిజన్లను బాగా ఆకట్టుకునేలా ఉండటంతో.. మొత్తానికి ఈ ప్రోమో బాగా వైరల్ అవుతుంది.
ఈ ప్రోమో వీడియోలో బాలయ్య సిగ్గు పడుతూ స్టైల్ గా నడుచుకుంటూ వస్తోన్న విజువల్స్, బైక్ పై ప్రగ్యా జైస్వాల్ ను కూర్చోపెట్టుకుని.. వెనుక నుంచి ఆమెను హత్తుకుంటున్న షాట్స్ బాగున్నాయి. బాలయ్యకి లుక్ అండ్ గెటప్ కూడా బాగా సూట్ అయ్యాయి. ఇక ప్రగ్యా జైస్వాల్ కూడా చాలా అందంగా కనిపిస్తూ బాగా ఆకట్టుకుంది. మొత్తానికి సాంగ్ ప్రోమో అదిరిపోయింది.
Here’s the song teaser of magical melody #AdigaaAdigaa❤️ from #Akhanda
Full Lyrical out today at 5:33PM#AkhandaMusicalRoar🦁 #BB3#NandamuriBalakrishna #BoyapatiSreenu @ItsMePragya @actorsrikanth @IamJagguBhai @MusicThaman #MiryalaRavinderReddy @dwarakacreation @LahariMusic pic.twitter.com/6y6nAapoIf— Dwaraka Creations (@dwarakacreation) September 18, 2021
ఈ సాంగ్ బాలయ్య కెరీర్ లోనే గొప్ప క్లాసిక్ సాంగ్ గా నిలిచిపోతుందని ఇప్పటికే మేము రివీల్ చేశాము. అందుకు తగ్గట్టుగానే సాంగ్ చాలా బాగా వచ్చిందట. ముఖ్యంగా సాంగ్ లో చాలా కొత్త ట్యూన్స్ ను థమన్ పరిచయం చేయబోతున్నాడు. ఏది ఏమైనా నటసింహం బాలయ్య బాబు – యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలిసి చేస్తోన్న ఈ ‘అఖండ పై రోజురోజుకు అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.
బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కావడం, సినిమాకి మంచి క్రేజ్ ఉండటంతో ఈ సినిమా థియేటర్స్ రైట్స్ కు కూడా బాగా డిమాండ్ ఉంది. పైగా ఈ సినిమాలో ప్లాష్ బ్యాగ్ కొత్త నేపథ్యంలో సరికొత్త అంశంతో సాగుతుందట. ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.