Balakrishna Akhanda 2: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరో గా నటించిన ‘అఖండ 2′(Akhanda2 Movie)చిత్రం పై ఎందుకో ప్రారంభం లో ఉన్న అంచనాలు ఇప్పుడు లేవు. ఈ సినిమాని ప్రకటించిన కొత్తల్లో కళ్ళు చెదిరిపోయే రేంజ్ బిజినెస్ ఆఫర్స్ వచ్చేవి. కానీ ప్రమోషనల్ కంటెంట్ బయటకు వచ్చిన తర్వాత గొప్ప ఆఫర్స్ ఏమి రావడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో మంచి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ 115 కోట్ల రూపాయలకు జరిగింది. బాలయ్య మార్కెట్ రేంజ్ కి ఇది చాలా ఎక్కువే. కానీ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయడానికి బోయపాటి శ్రీను తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకు ప్రొమోషన్స్ కూడా నాన్ స్టాప్ గా చేస్తున్నారు. అనేక ఈవెంట్స్ ని కూడా ప్లాన్ చేశారు.
రీసెంట్ గానే ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ని కూడా కలిసి, అఖండ చిత్రం లోని కొన్ని సన్నివేశాలను చూపించాడు. నార్త్ ఇండియా లో చేయబోయే ఈవెంట్ కి ముఖ్య అతిథిగా రావాల్సిందిగా కోరినట్టు సమాచారం. ఇంత చేస్తున్నప్పటికీ కూడా ఈ సినిమా ని హిందీ మరియు ఇతర భాషల్లో కొనుగోలు చేయడానికి ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రావడం లేదట. కొనుగోలు చేయకపోయినా పర్వాలేదు, మా సినిమాని గ్రాండ్ గా విడుదల అయ్యేలా చేయండి, వచ్చే డబ్బుల్లో షేర్ చేసుకుందాం అని చెప్పినా కూడా ఎవ్వరూ ఆసక్తి చూపించడం లేదట. ఎందుకంటే బాలయ్య కి హిందీ లో అసలు మార్కెట్ లేకపోవడమే కారణమని అంటున్నారు. కేవలం హిందీ లోనే కాదు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో కూడా ఇదే పరిస్థితి. దీంతో నిర్మాతకు ఇప్పుడు ఈ సినిమా ని ఇతర భాషల్లో విడుదల చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నారట.
ఇకపోతే రీసెంట్ గా విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ పై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్రోల్స్ నడిచాయి. ముఖ్యంగా ఓవర్సీస్ ఆడియన్స్ అయితే ఈ చిత్రాన్ని పూర్తిగా నిరాకరించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు ఈ చిత్రానికి కేవలం 1 లక్షా 26 వేల డాలర్లు మాత్రమే వచ్చాయి. 1 మిలియన్ డాలర్స్ ప్రీమియర్ షోస్ నుండి వస్తాయని అనుకున్నారు. కానీ బాలయ్య గత చిత్రం ‘డాకు మహారాజ్’ ప్రీమియర్స్ గ్రాస్ ని కూడా దాటేలా కనిపించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు ఇంతకు ముందు ఉన్నంత హైప్ లేదు. చూడాలి మరి విడుదలయ్యాక ఎంత వరకు ఈ సినిమా రీచ్ అవుతుంది అనేది.