Bigg Boss 9 Telugu Thanuja: ప్రతీ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) సీజన్ లోనూ ఎలిమినేషన్స్ చాలా న్యాయబద్దంగా జరుగుతుంటాయి. కానీ ఈ సీజన్ లో మాత్రం బిగ్ బాస్ టీం కి తమకు కావాల్సిన వాళ్ళని హౌస్ లో ఉంచుకొని, షో కి అవసరం లేదు అనుకున్న వాళ్ళని మాత్రం తరిమేస్తున్నారు. అందుకు ది బెస్ట్ ఉదాహరణ శ్రీజ ని ఎలిమినేట్ చేయడం, గత వారం లో ఎలిమినేట్ అయిన దివ్య ని హౌస్ లో ఉంచుకోవడం. గత వారం ఫ్యామిలీ వీక్ అయినప్పటికీ, ఎవ్వరూ ఊహించని విధంగా చివరి కెప్టెన్సీ టాస్క్ లో తనూజ మరియు దివ్య మధ్య జరిగిన గొడవ బిగ్ బాస్ హిస్టరీ లోనే ది బెస్ట్ అని అందరూ అనుకున్నారు. ఒకరిని ఒకరు జుట్టు పీక్కొని కొట్టుకునే రేంజ్ వరకు ఈ గొడవ వెళ్ళింది. ఆ ఒక్క ఎపిసోడ్ కి టీఆర్ఫీ రేటింగ్స్ బ్లాస్ట్ అయ్యే రేంజ్ లో వచ్చాయి.
దీన్ని గమనించిన బిగ్ బాస్ టీం హౌస్ లో ఎవ్వరూ కూడా టాప్ ఓటింగ్ ఉన్న తనూజ తో గొడవలు పెట్టుకోవడానికి భయపడుతున్నారు, దివ్య ఒక్కటే ధైర్యం గా ఆమెతో గొడవలు పెట్టుకుంది, కాబట్టి ఈ వారం నో ఎలిమినేషన్ ని పెట్టి దివ్య కి ఒక అవకాశం ఇద్దామని అనుకోని నో ఎలిమినేషన్ పెట్టారు. కానీ వీళ్లిద్దరు నామినేషన్ ప్రక్రియ మొదలు అవ్వకముందే స్నేహితులు అయిపోయారు. ఇక డైరెక్ట్ నామినేషన్స్ లో అయితే ముందుగా దివ్య నే తనూజ తో గొడవలు వద్దు అన్నట్టు నామినేట్ చేసింది. ఆ తర్వాత తనూజ కూడా అదే తరహా నామినేట్ చేసి, దివ్య ని గట్టిగా కౌగలించుకుంది. ఈ సీన్ ని చూసి బిగ్ బాస్ టీం కి మైండ్ బ్లాక్ అయ్యి, బుర్ర బయటకి వచ్చేంత పని అయ్యింది. పాపం భరణి కూడా ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు.
Also Read: ఈ వారం ట్రిపుల్ ఎలిమినేషన్..? సంజన, డెమోన్ పవన్ లకు రెడ్ కార్డ్?
ప్రతీ సారి వీళ్ళిద్దరూ కొట్టుకొని నన్ను వాళ్ళ గొడవల్లోకి లాగేవారు, కానీ ఇప్పుడు ఇద్దరు ఒక్కటై నన్ను బకరా అని చేశారు, నేనేమో వాళ్ళిద్దరి కారణంగా నాకు సమస్య అవుతుందని ఇద్దరినీ నామినేట్ చేసాను అని అనుకున్నాడు. భరణి తో శుక్రవారం ఎపిసోడ్ లో దివ్య మాట్లాడుతూ ‘తనూజ తో గొడవలు పెట్టుకుంటేనే ఉంటాను. అసలు ఆమె అన్న మాటలకు క్షమాపనే లేదు. బయటకు వెళ్లిన తర్వాత కూడా నేను ఆమె ముఖం చూడను’ అని అంటుంది. అబ్బో ఈ రేంజ్ లో ఉందంటే ఈమె కచ్చితంగా గొడవ పెట్టుకుంటుందేమో అనుకోని నమ్మి బిగ్ బాస్ టీం ఆమెని హౌస్ లో ఉంచినందుకు వేరే లెవెల్ లో టీం ని ఫూల్స్ చేశారు. ఇప్పుడు దివ్య తో గొడవలు తనూజ పెట్టుకోదు కాబట్టి, ఆమెకు కంటెంట్ వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఈ వారం ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.