NBK107: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస చిత్రాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇప్పటికే బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాను చేస్తున్నారు. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తి కావస్తోంది. ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఆ తర్వాత గోపచంద్ మలినేని దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. తాజాగా, ఈ రోజు(శనివారం) ఉదయం లాంఛనంగా ఈ సినమాను పూజాకార్యక్రమాలతో ప్రారంభించారు. బాలయ్య 107వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్నిNBK107 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్నారు. ఇందులో బాలయ్యకు జోడీగా శ్రుతి హాసన్ నటించనుంది.

పూజా కార్యక్రమంలో దర్శకులు బోయపాటి శ్రీను, వివి వినాయక్, హరీశ్ శంకర్, కొరటాల శివ, బాబీ, బీవీఎస్ రవి, బుచ్చిబాబు సన, సాయి మాధవ్ బుర్రా, శ్రుతిహాసన్ పాల్గొన్నారు. వివి వినాయక్ తొలి క్లాప్ కొట్టారు. బోయపాటి కెమెరా రోల్ చెప్పారు. ఫస్ట్ షాట్ డైరెక్షన్ హరీశ్ శంకర్ చేశారు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. థమన్ సంగీతం అందిస్తుండగా.. త్వరలోనే పూర్తిస్థాయిలో షూటింగ్ ప్రారంభం కానుంది.
ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఓటీటీ వేదికైన ఆహాలో వస్తోన్న అన్‌స్టాపబుల్ విక్ ఎన్బీకేలో హోస్ట్‌గా నిర్వహిస్తూ.. షోను పరుగులు పెట్టిస్తున్నారు బాలయ్య. ఇప్పటికే రెండు ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న బాలయ్య.. ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. కొంటె ప్రశ్నలతో, ఆటలతో, డైలాగ్, డాన్స్‌లతో షోను మరింత వేడి పుట్టిస్తున్నారు.