https://oktelugu.com/

Balagam Actress Soudamini: ‘బలగం’ సినిమా నటికి బంఫర్ ఆఫర్..

నటి పేరు సౌదామిని. ఈమె సినిమాలో కనిపించింది కేవలం మూడు నిమిషాలే. కానీ ఆమె పాత్రకూ ప్రాధాన్యం ఉంది. అమెతో ప్రేమ వ్యవహారం నడిపేందుకు సాయి తెగ కష్టపడిపోతుంటారు. ఆమె కోసం కూల్ డ్రింక్స్ ఇస్తాడు. ప్రత్యేక మర్యాదలు చేస్తాడు. అయితే చివరికి ఆమెతో పెళ్లి రద్దవుతుంది. ముందుగా బాధపడ్డా.. ఆ తరువాత తన మరదలుతో లవ్లో పడతాడు.

Written By: , Updated On : April 28, 2023 / 05:29 PM IST
Follow us on

Balagam Actress Soudamini: తండ్రి సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన ‘బలగం’ మూవీ ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ ఈ మూవీకి అంతర్జాతీయ అవార్డులు వస్తూనే ఉన్నాయి. ఈ సినిమా తీసిన డైరెక్టర్ వేణుకు అన్ని వైపులా నుంచి ప్రశంసలు తక్కుతున్నాయి. అలాగే ఇందులో నటించిన వారితో మీడియా సంస్థలు హల్ చల్ చేస్తున్నాయి. బలగం మూవీలో హీరో, హీరోయిన్లు ఉన్నా.. ఇందులో ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా గుర్తింపు వచ్చింది. ఎవరికి వారే నటనతో ఇరగదీశారు. ఒకరకంగా జీవించారని చెప్పొచ్చు. వీరిలో ఓ నటి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సాయి పాత్రలో నటించిన ప్రియదర్శన్ పెళ్లి చేసుకునే అమ్మాయిలా కనిపించిన నటి గుర్తుందా? ఆమెకు ఇప్పుడు ఓ పెద్ద సినిమాలో నటించే అవకాశం వచ్చింది.

ఈ నటి పేరు సౌదామిని. ఈమె సినిమాలో కనిపించింది కేవలం మూడు నిమిషాలే. కానీ ఆమె పాత్రకూ ప్రాధాన్యం ఉంది. అమెతో ప్రేమ వ్యవహారం నడిపేందుకు సాయి తెగ కష్టపడిపోతుంటారు. ఆమె కోసం కూల్ డ్రింక్స్ ఇస్తాడు. ప్రత్యేక మర్యాదలు చేస్తాడు. అయితే చివరికి ఆమెతో పెళ్లి రద్దవుతుంది. ముందుగా బాధపడ్డా.. ఆ తరువాత తన మరదలుతో లవ్లో పడతాడు. అయితే సౌదామిన ఇందులో కాస్త లావుగా కనిపించారు. వాస్తవానికి సౌదామిని స్లిమ్ గానే ఉంటారు. కానీ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా 10 కేజీలు పెరిగారట.

Balagam Actress Soudamini

Balagam Actress Soudamini

చదువు పూర్తి చేసుకొని సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఈమెకు బలగం లో అవకాశం వచ్చింది. ఆమెకు ఉన్నది చిన్న పాత్రే అయినా ఆమె కమిట్మెంట్ చూసి అందరూ ప్రశంసిస్తున్నారు. అయితే ఈ కమిట్మెంట్ కు ‘జాతిరత్నాలు’ డైరెక్టర్ అనుదీప్ కేవీ ఫిదా అయ్యాడట. ఆయన ఈ సినిమా చూసిన తరువాత సౌదామినికి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పాడట. అంతేకాకుండా తన నెక్ట్ష్ మూవీలో అవకాశం ఇస్తున్నట్లు చెప్పాడట.

పాత్ర ఏదైనా అందులో ఇన్వాల్వ్ అయ్యే విధంగా నటిస్తే అవకాశాలు అవే వస్తాయి అనడానికి సౌదామినినే ఉదాహరణ అని కొందరు కొనియాడుతున్నారు. చాలా మంది సినిమాల్లో నటించాలంటే అందం ఉండాలని అనుకుంటారు. కానీ తనకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేస్తే ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని చెబుతున్నారు. మరి సౌదామిని ఇంకెన్ని సినిమాల్లో అవకాశం దక్కించుకుంటుందో చూద్దాం..