Homeఎంటర్టైన్మెంట్Bala Krishna: అన్​స్టాపబుల్​ షో లో బాలయ్య ఫోటోలు ... షేర్ చేసిన ఆహా యూనిట్

Bala Krishna: అన్​స్టాపబుల్​ షో లో బాలయ్య ఫోటోలు … షేర్ చేసిన ఆహా యూనిట్

Bala Krishna: నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పూడు మరో కొత్త అవతారం లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాడు. ప్రముఖ తెలుగు ఓటిటీ సంస్థ ఆహా లో … ఆయన ‘అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే’ అనే ప్రొగ్రామ్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ టాక్​ షోలో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు అతిథులుగా పాల్గొననున్నారు. దీపావళి కానుకగా నవంబరు 4న ఈ ప్రొగ్రాం ఫస్ట్ ఎపిసోడ్ ను ప్రారంభించనున్నారు. కాగా ఇటీవల ఈ ప్రోగ్రాం కు సంబంధించి పరిచయ వేడుక నిర్వహించారు. అయితే ఇప్పుడు తాజాగా షూటింగ్ లొకేష‌న్‌ లో బాలయ్యకు సంబంధించిన ప‌లు ఫొటోలను ఆహా బృందం విడుద‌ల చేశారు.

bala krishna pictures from unstoppable show released by aha team

ఫస్ట్ టైమ్ ఆ సింహాన్ని రెండోవైపు చూడబోతున్నారు… అది కూడా అన్ స్టాపబుల్’ షో లో అంటూ బాలకృష్ణ చెప్పారు. ప్రతీ మనిషి జీవితంలోనూ ఎత్తుపల్లాలు ఉంటాయి… వాటిని అధిగమించి లక్ష్యాన్ని చేరడమే అన్ స్టాపబుల్ అని బాలయ్య అన్నారు. అంటూ ఇటీవల జరిగిన ఈవెంట్ లో మాట్లాడారు. ఈ షో కోసం నందమూరి బాలకృష్ణ సరికొత్తగా కనిపించనున్నారు అని అర్థమవుతోంది. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ, సీనియర్ రైటర్ బివిఎస్ రవి ఈ ప్రోగ్రాంను డైరెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు వెండితెర‌పై ద‌డ‌ద‌డ‌లాడించిన బాల‌కృష్ణ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫాంలో ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తారో అని ఆయన అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.

మొదటి సారి బాలయ్య చేస్తున్న ఈ టాక్ షో కోసం రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలో డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షోకు సంబంధించిన కొన్ని ఎపిసోడ్లు అయితే షూట్ చేశారు. త్వరలోనే ప్రోమో కూడా విడుదల చేయనున్నారు. ఇందులో బాల‌య్య డిఫ‌రెంట్ స్టైల్‌లో క‌నిపించడం పట్ల ఆయ్న ఫ్యాన్స్ అంతా ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్ర‌స్తుతంఈ ఫోటో లు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version