Bhola Shankar : ‘వాల్తేరు వీరయ్య’ లాంటి సంచలనాత్మక విజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటిస్తున్న చిత్రం ‘భోళా శంకర్’. తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన అజిత్ ‘వేదలమ్’ చిత్రం స్టోరీ లైన్ తీసుకొని, చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ మెహర్ రమేష్. ఈ నెలాఖరు లోపు షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకోబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఒక్కొక్కటిగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
మహతి సాగర్ స్వరపరిచిన మొదటి పాట ‘భోళా మేనియా’ ని 4 వ తేదీన విడుదల చేస్తున్నట్టుగా ఒక చిన్న ప్రోమో ద్వారా తెలిపారు. అయితే ఈ పాట నేడు విడుదల కావడం లేదని సమాచారం. ఈ పాటకి సంబంధించి నిన్న ట్విట్టర్ కనీసం ఒక్క ట్వీట్ కూడా వెయ్యలేదు మూవీ టీం.
అయితే నిన్న ఒడిశా లో జరిగిన రైలు ప్రమాదం లో చనిపోయిన సందర్భంలో, ఇప్పుడు ఈ సాంగ్ ని విడుదల చెయ్యడం కరెక్ట్ కాదని, వెంటనే వాయిదా వెయ్యమని మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన ఆదేశం మేరకే ఈ సాంగ్ ని వాయిదా వేసినట్టు తెలుస్తుంది. సోమవారం కానీ, లేదా వచ్చే వారం లో ఎదో ఒక రోజు ఈ సాంగ్ ని విడుదల చేసే అవకాశం ఉందట.
ఈ చిత్రం లో మహతి సాగర్ మూడు పాటలు అద్భుతమైన ఊర మాస్ ట్యూన్స్ అందించాడట. రీసెంట్ సమయం లో మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే బెస్ట్ ట్యూన్స్ అని అంటున్నారు. అంతే కాదు, సినిమా కూడా అభిమానులు ఊహించిన దానికంటే ఎక్కువే ఉంటుందట. ఈ చిత్రం లో తమన్నా హీరోయిన్ గా నటించగా, కీర్తి సురేష్ చిరంజీవి కి చెల్లెలుగా నటిస్తుంది. ఆగష్టు 11 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చెయ్యబోతున్నారు.