Kalyan Krishna: బంగార్రాజు డైరెక్టర్ కి ఎదురైన చేదు అనుభవం.. పనికిరావ్ పో అన్నారు!

Kalyan Krishna: సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ.. బంగార్రాజు మూవీతో బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు రికార్డు వసూళ్లు రాబడుతుంది. విడుదలైన మూడు రోజుల్లో రూ. 53 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టి పర్ఫెక్ట్ సంక్రాంతి చిత్రంగా నిలిచింది. నాగార్జున-నాగచైతన్యల ఈ మల్టీస్టారర్ ప్రతికూలత మధ్య కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. బంగార్రాజు మూవీ విడుదల కాకుండానే మరో […]

Written By: Shiva, Updated On : January 19, 2022 2:39 pm
Follow us on

Kalyan Krishna: సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ.. బంగార్రాజు మూవీతో బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు రికార్డు వసూళ్లు రాబడుతుంది. విడుదలైన మూడు రోజుల్లో రూ. 53 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టి పర్ఫెక్ట్ సంక్రాంతి చిత్రంగా నిలిచింది. నాగార్జున-నాగచైతన్యల ఈ మల్టీస్టారర్ ప్రతికూలత మధ్య కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

Kalyan Krishna

బంగార్రాజు మూవీ విడుదల కాకుండానే మరో సినిమాకు సైన్ చేశాడు కళ్యాణ్ కృష్ణ. ప్రముఖ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి సిద్ధమైంది. ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ నటించనున్నట్లు సమాచారం. మరి కళ్యాణ్ కృష్ణ ఈ స్థాయికి చేరడానికి చాలా కష్టాలు పడ్డారట. దర్శకుడుగా పరిశ్రమలో ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో కళ్యాణ్ కృష్ణ ఎదుర్కొన్న ఇబ్బందులు, అవమానాల గురించి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఓ సినిమాకు కళ్యాణ్ కృష్ణ అప్రెంటిస్ గా పనిచేశారట. షూటింగ్ పూర్తయిన తర్వాత డబ్బింగ్ మొదలైంది. డబ్బింగ్ కి నువ్వు రావాల్సిన అవసరం లేదని చెప్పారట. అయితే ఆసక్తితో కళ్యాణ్ కృష్ణ ప్రసాద్ ల్యాబ్స్ లో డబ్బింగ్ జరుగుతున్న రూమ్ డోర్ దగ్గర వారం రోజుల పాటు నిల్చున్నాడట. ఓ రోజూ ఆ సినిమా నిర్మాత బయట ఎందుకు నిల్చుంటున్నావ్… లోపలి రావచ్చు కదా అన్నారట. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ లోపలికి తీసుకెళ్లి లైట్ ఆన్ చేసి ఆఫ్ చేసే ఓ పని అప్పగించాడట.

Also Read: బాక్సాఫీస్ : ‘బంగార్రాజు’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ !

దాదాపు నాలుగు గంటల పాటు నిల్చొని లైట్ దగ్గర పనిచేశాక… పక్కనే ఉన్న కుర్చీలో కూర్చొని పని చేస్తున్నాడట. ఇది చూసిన నిర్మాత ఎందుకు కుర్చున్నావ్ అన్నారట. నాలుగు గంటల నుండి నిల్చున్నాను, కాళ్ళు నొప్పి రావడంతో కుర్చీలో కూర్చొని పని చేస్తున్నాను అని సమాధానం చెప్పాడట. ఈ మాత్రం సహనం లేకపోతే సినిమాల్లో ఏమి రాణిస్తావ్.. మాకు అవసరం లేదు వెళ్ళిపో అన్నారట.

అప్పుడు తనను ఆ మాట అన్నవారు ఇప్పుడు కూడా టచ్ లో ఉన్నట్లు కళ్యాణ్ కృష్ణ తెలిపాడు. ఇలాంటి చేదు అనుభవాలు చాలా ఎదురయ్యాయని కళ్యాణ్ కృష్ణ తెలిపాడు. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం తర్వాత కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన రారండోయ్ వేడుక చూద్దాం, నేల టికెట్ అనుకున్నంత విజయం సాధించలేదు. బంగార్రాజు మూవీ కోసం కళ్యాణ్ కృష్ణ రెండేళ్లకు పైగా ఎదురుచూశారు.

Also Read: రెండోరోజు ‘బంగార్రాజు’ వసూళ్ల మోత..!

Tags