Homeఎంటర్టైన్మెంట్Bad Boy Karthik Twitter Talk: 'బ్యాడ్ బాయ్ కార్తీక్' ట్విట్టర్ టాక్ ఇదే.. నాగ...

Bad Boy Karthik Twitter Talk: ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ట్విట్టర్ టాక్ ఇదే.. నాగ శౌర్య కి ఈసారైనా అదృష్టం కలిసొచ్చిందా..

Bad Boy Karthik Twitter Talk: టాలెంట్, స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నప్పటికీ , సరైన స్క్రిప్ట్ సెలక్షన్ లేకపోవడం వల్ల , ఇండస్ట్రీ లో కనీస స్థాయి మార్కెట్ ని కూడా క్రియేట్ చేసుకోలేకపోయిన హీరోలు కొందరు ఉన్నారు. వారిలో నాగ శౌర్య ఒకడు. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈ హీరో ని చూసి , కుర్రాడు చాలా చక్కగా ఉన్నాడు , నటన కూడా బాగుంది , సరైన స్క్రిప్ట్స్ ని ఎంచుకొని ముందుకు పోతే నాని , రవితేజ లాగా సక్సెస్ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఇతను చేసిన సినిమాలన్నీ ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. మొదటి సినిమా తర్వాత పది సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత చేసిన ‘ఛలో ‘ సూపర్ హిట్ గా నిల్చింది.

ఆ తర్వాత మళ్లీ ఫ్లాపులు తప్పలేదు. 2020 లో విడుదలైన ‘అశ్వద్ధామ’ యావరేజ్ రేంజ్ లో ఆడింది, కానీ క్లీన్ కమర్షియల్ సక్సెస్ కోసం ఆయన ఎదురు చూపులు ఆగలేదు. ఇక 2023 లో ‘రంగబలి’ చిత్రం తో మన ముందుకొచ్చాడు. ఈ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు , థియేటర్స్ లో విడుదలయ్యాక ఫస్ట్ హాఫ్ వరకు మంచి రిపోర్ట్స్ వచ్చాయి. సెకండ్ హాఫ్ బాగాలేదని అన్నారు. కమర్షియల్ గా ఇది కూడా ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఆయన మూడేళ్లు గ్యాప్ తీసుకొని , ఇప్పుడు మన ముందుకు ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ తో వచ్చాడు. ఈ సినిమాకు ట్విట్టర్ ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఒకసారి ఈ విశ్లేషణలో చూద్దాం. టైం ట్రావెల్ చేసి 2010 వ సంవత్సరానికి వెళ్లి విడుదల చెయ్యాల్సిన సినిమాని , 2026 లో విడుదల చేశారు , చాలా నాసిరకమైన మూవీ, అంటూ ఈ చిత్రాన్ని చూసిన నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈమధ్య కాలంలో విడుదలైన అత్యంత చెత్త సినిమా ఇదేనని అంటున్నారు. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నాగ శౌర్య కి ఇలాంటి మాస్ టచ్ ఉన్న సినిమా అసలు సూట్ కాలేదని అంటున్నారు. ఈ సినిమాని చూస్తున్నంతసేపు , ఒకప్పటి రామ్ చరణ్, ఎన్టీఆర్ మాస్ జానర్ సినిమాలు గుర్తుకు వస్తాయి. సినిమా మొత్తం మీద పాజిటివ్ ఎలిమెంట్ ఏదైనా ఉందా అంటే , అది ఇంటర్వెల్ బ్లాక్ మాత్రమే. అది తప్ప , సినిమా స్క్రీన్ ప్లే మొత్తం థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ సహనానికి పరీక్ష పెడుతుంది. కాలక్షేపానికి కనీసం ఓటీటీ లో కూడా చూడదగ్గ సినిమా కాదని అంటున్నారు నెటిజెన్స్. ఈ రేంజ్ నెగెటివ్ రెస్పాన్స్ ఒక సినిమాకు రావడం చూసి చాలా కాలమే అయ్యింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version