Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కిన హిస్టారికల్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి : ది ఎపిక్'(Bahubali : The Epic) నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా రీ రిలీజ్ అయ్యింది. అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూసారు. ఈమధ్య కాలం లో ప్రతీ ఒక్కరు రీ రిలీజ్ లతో మనముందుకు వస్తున్నారు. అసలు సరైన రీ రిలీజ్ అంటే ఏమిటి అనేందుకు అర్థం చూపించాడు రాజమౌళి. మొదటిసారి విడుదల చేసినప్పుడు ఎడిటింగ్ లో తీసి వేయబడిన సన్నివేశాలను కొన్ని జత చేసి రిలీజ్ చేశారు. వాటికి నేడు థియేటర్స్ నుండి బంపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతే కాదు కొత్త సినిమా రిలీజ్ అప్పుడు ఎలా అయితే ప్రొమోషన్స్ చేస్తారో, అలా ఈ సినిమాకు కూడా ప్రొమోషన్స్ చేశారు. నిన్న ప్రభాస్, రాజమౌళి, రానా లు కలిసి చేసిన ఒక ఇంటర్వ్యూ ని విడుదల చేశారు.
ఈ ఇంటర్వ్యూ లో బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో జరిగిన అనుభూతులను పంచుకుంటూ చిట్ చాట్ చేసుకున్నారు. అందులో ఒక సంఘటన గురించి రాజమౌళి చెప్పిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. బాహుబలి షూటింగ్ ప్రారంభం సమయం లో, కర్నూల్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు భారీగా జనాలు షూటింగ్ లొకేషన్ కి వచ్చిన విజువల్స్ మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ప్రభాస్ అభిమానులందరి వైపు చూసి చేతులు ఊపుతాడు. ఈ సంఘటన జరిగి వెళ్ళేటప్పుడు ప్రభాస్, రాజమౌళి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందట. క్రిందకు దిగేటప్పుడు గుర్రం తో దిగాల్సి వచ్చిందని ప్రభాస్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అప్పుడు రానా అక్కడకు వచ్చి, ఒక కారు ని ఆపేసాను, అందులో వెళ్దాం పదండి అని చెప్పాడు. కారు ఎక్కి వెళ్తున్నప్పుడు కార్తికేయ, ఒక పోలీస్ ఆయన జనాలను కంట్రోల్ చేస్తున్నారు.
ఈ క్రమం లో వాళ్లిద్దరూ లాఠీ తో జనాలను కొట్టాల్సి వచ్చింది అట, అప్పుడు ప్రభాస్, ప్లీజ్ కొట్టదు అని చెప్పండి, అభిమానులు వాళ్ళు ప్లీజ్ అని రానా తో చెప్పి బ్రతిమిలాడాడు అట. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి నిన్నటి ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. అలా ఆద్యంతం సరదాగా సాగిపోయింది ఈ ఇంటర్వ్యూ. ప్రభాస్ చాలా మంచివాడు అనే విషయం అందరికీ తెలుసు, కానీ మరీ ఇంత మంచివాడనే విషయం రోజు రోజుకి ఆయన గురించి చెప్పే వాళ్ళు వింటేనే తెలుస్తుంది. తన తోటి నటీనటులతో ఎలా ప్రవర్తించాలో అనేది మాత్రమే కాదు, అభిమానులతో ఎలా ప్రవర్తించాలి అనేది కూడా ప్రభాస్ ని చూసి నేర్చుకోవాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
The only hero in India who lives solely for his fans and movies, putting family and marriage aside
Kottakandra papam, fans ra anta pic.twitter.com/yoGRFB1HT5
— Legend Prabhas (@CanadaPrabhasFN) October 29, 2025