Mass Jathara vs Bahubali The Epic: మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja) నటించిన ‘మాస్ జాతర'(Mass Jathara Movie) చిత్రం ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. వాస్తవానికి ఈ చిత్రం రేపే విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వాళ్ళ ఒక్క రోజు ముందుకు వెళ్ళింది. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ షోస్ నుండి ప్రీమియర్ షోస్ పడబోతున్నాయి. హైదరాబాద్ లో ఇప్పటికే ఇప్పటికే ప్రీమియర్స్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ట్రెండ్ పర్వాలేదు అనే రేంజ్ లో ఉంది. మిగిలిన ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా మొదలు అవ్వలేదు. అయితే బుకింగ్స్ ని మొదలు పెట్టిన ప్రతీ చోట ‘బాహుబలి : ది ఎపిక్'(Bahubali : The Epic) రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రమే బలంగా ఉన్నాయి. చూస్తుంటే ఈ రీ రిలీజ్ కి ‘మాస్ జాతర’ కంటే ఎక్కువ ఓపెనింగ్ వచ్చేలా కనిపిస్తుంది.
ముఖ్యంగా ఓవర్సీస్ లో ‘మాస్ జాతర’ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ కంటే ‘బాహుబలి : ది ఎపిక్’ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ పది రెట్లు ఎక్కువ ఉన్నాయి. నార్త్ అమెరికా లో మాస్ జాతర కి బుకింగ్స్ ద్వారా ఇప్పటి వరకు కనీసం పది వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు కూడా నమోదు అవ్వలేదు. కానీ ‘బాహుబలి : ది ఎపిక్’ రీ రిలీజ్ కి అప్పుడే 3 లక్షల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్ లో ‘బాహుబలి : ది ఎపిక్’ భారీ మార్జిన్ గ్రాస్ లీడింగ్ తో కొనసాగుతుంటే, మాస్ జాతర కి అందులో పావు శాతం బుకింగ్స్ కూడా లేదు. కేవలం హైదరాబాద్ సిటీ నుండి ‘బాహుబలి : ది ఎపిక్’ కి దాదాపుగా రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
కానీ ఇప్పటి వరకు ‘మాస్ జాతర’ కి వరల్డ్ వైడ్ గా కలిపి కూడా అంత గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వలేదు. రాజమండ్రి, ఏలూరు, తణుకు, వైజాగ్, విజయవాడ ఇలా ప్రతీ చోట మాస్ జాతర చిత్రం ‘బాహుబలి : ది ఎపిక్’ కి దరిదాపుల్లో కూడా లేదు. రవితేజ లాంటి మాస్ హీరో కొత్త చిత్రం ఒక రీ రిలీజ్ ముందు ఈ రేంజ్ లో డామినేట్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. గతం లో ఆయన వరుసగా చేసిన డిజాస్టర్ సినిమాల ప్రభావం మాస్ జాతర చిత్రం పై బలంగా పడింది. ఫలితంగానే ఈ సినిమాకు కనీస స్థాయి ఓపెనింగ్ కూడా పడేలా కనిపించడం లేదు. కానీ ట్రైలర్ చూస్తుంటే రవితేజ కం బ్యాక్ ఈ చిత్రం తోనే జరిగేలా కనిపిస్తుంది. లాంగ్ రన్ లో హిట్ అవ్వొచ్చు కానీ, మొదటి రోజు ఓపెనింగ్ మాత్రం చాలా తక్కువే ఉండేలా అనిపిస్తుంది.