Baahubali Reunion: తెలుగు సినిమా ముఖచిత్రం మార్చేసిన బాహుబలి విడుదలై దశాబ్దం గడిచిన నేపథ్యంలో… చిత్ర యూనిట్ రీయూనియన్ అయ్యారు. బాహుబలి విజయాన్ని సెలెబ్రేట్ చేసుకున్నారు. అయితే ఈ వేడుకకు హీరోయిన్స్ అనుష్క శెట్టి, తమన్నా హాజరుకాకపోవడం చర్చనీయాంశం అయ్యింది.
దిగ్గజ దర్శకుడు రాజమౌళి(Rajamouli) తెరకెక్కించిన మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం బాహుబలి. తెలుగు సినిమా మార్కెట్ రెండు వందల కోట్లు కూడా లేని సమయంలో వందల కోట్ల బడ్జెట్ తో బాహుబలి ఆయన తెరకెక్కించాడు. సినిమాలో విషయం ఉంటే భాషాబేధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని రాజమౌళి నమ్మారు. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ బాహుబలి భారీ విజయం అందుకుంది. వరల్డ్ వైడ్ రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. హీరో ప్రభాస్(Prabhas) ఇమేజ్ దేశవ్యాప్తం అయ్యింది. బాహుబలి చిత్రంలో అనుష్క శెట్టి(Anushka Shetty), తమన్నా హీరోయిన్స్ గా నటించారు.
Also Read: అల్లు అర్జున్, అట్లీ మూవీ లో విలన్ గా రష్మిక..? ఆమె లుక్ ఎలా ఉండబోతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
బాహుబలి(Baahubali) చిత్రంలో కీలక రోల్స్ చేసిన రానా, సత్యరాజ్, రమ్యకృష్ణలకు సైతం మంచి పాపులారిటీ దక్కింది. చారిత్రాత్మక విజయం సొంతం చేసుకున్న బాహుబలి 2015 జులై 10న థియేటర్స్ లోకి వచ్చింది. సినిమా విడుదలై 10 ఏళ్ళు అవుతున్న సందర్భంగా బాహుబలి చిత్ర యూనిట్ రీ యూనియన్ అయ్యారు. దర్శకుడు రాజమౌళి, ప్రభాస్, రానా, రమ్యకృష్ణతో పాటు నిర్మాతలు, సాంకేతిక నిపుణులు ఈ వేడుకలు పాల్గొన్నారు. బాహుబలి విజయాన్ని మరోసారి సెలెబ్రేట్ చేసుకున్నారు. అయితే ఈ వేడుకకు హీరోయిన్స్ అనుష్క శెట్టి, తమన్నా హాజరుకాలేదు.
తమన్నా హైదరాబాద్ లో లేదని సమాచారం. అందుకే ఆమె హాజరుకాలేదట. అందుబాటులో ఉన్నప్పటికీ అనుష్క రాలేదనే వార్త పుకార్లకు తెరలేపింది. రాజమౌళి, ప్రభాస్ లతో ఆమెకు విబేధాలు ఉన్నాయని, అందుకే ఆమె ఆహ్వానం అందినప్పటికీ రాలేదనే టాక్ వినిపిస్తుంది. రాజమౌళి, ప్రభాస్ లతో విబేధాలు అనే ఉహాగానాల్లో నిజం లేదనే మరో వాదన కూడా తెరపైకి వచ్చింది. అనుష్క రాకపోవడానికి మరొక బలమైన కారణం ఉందట. బాహుబలి అనంతరం అనుష్క సైజ్ జీరో పేరుతో ఓ ప్రయోగాత్మక చిత్రం చేసింది. ఆ సినిమా కోసం ఆమె బరువు పెరిగింది.
Also Read: ప్రభాస్ లుక్కే ఇప్పుడు ట్రెండింగ్.. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ట్రోల్స్!
తర్వాత అనుష్క ఎంత ప్రయత్నం చేసినా పూర్వపు స్థితికి రాలేకపోయింది. బాహుబలి 2కి ఆమె లుక్ ఇబ్బందికరంగా మారింది. గ్రాఫిక్స్ మాయాజాలంతో కొంతమేరకు ఆమెను స్లిమ్ గా చూపించే ప్రయత్నం చేశాడు రాజమౌళి. ఈ మధ్య అనుష్క మరింత బరువు పెరిగారని, అందుకే ఆమె మీడియా ముందుకు వచ్చేందుకు ఇష్టపడటం లేదని అంటున్నారు. ఘాటీ మూవీ ప్రమోషన్స్ లో కూడా అనుష్క అందుకే పాల్గొనడం లేదట. ఈ మేరకు మరో వాదన వినిపిస్తుంది. మరి ఈ పుకార్లలో ఏది నిజమో తెలియాల్సి ఉంది. క్రిష్ దర్శకత్వం వహించిన ఘాటీ విడుదలకు సిద్ధం అవుతుంది.
Baahubali Team Re-Union ❤️✨#Prabhas Anna Looks ❤️
#10YearsofTheEpicBaahubali pic.twitter.com/mJhoQzOVLO
— Jaya Sankar⚔️ (@Prabhas_Jai2718) July 10, 2025