మాల్దీవ్స్ బీచ్ లో మల్టీ-కలర్ కార్టూన్ ప్రింట్ బికినీలో బీ టౌన్ బ్యూటీ ( Sara Ali Khan): బాలీవుడ్ దిగ్గజ నటులలో ఒకరైన సైఫ్ అలీ ఖాన్ ముద్దుల కూతురైన సారా అలీ ఖాన్ కు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో (ఇన్ స్టాగ్రామ్) ఖాతా తెరిచిన కొన్ని రోజులకే 20 లక్షల మందికి పైగా ఫాలోవర్లు పెరిగిపోయారు. ఏదైనా ఫొటో పెట్టగానే గంటకే పది లక్షలకుపైగా లైక్స్ వస్తున్నాయంటే సారా అలీ ఖాన్ ఏ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉందో అర్థంచేసుకోవచ్చు. ఇప్పుడున్న స్టార్ కిడ్స్‌లో సారా అలీ ఖాన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరెవ్వరికీ లేదు అని అనడం లో అతిశయోక్తి లేదు.
ఎక్స్‌పోజింగ్, క్లీవేజ్ షో హీరోయిన్లకు చాలా కామనే. ఎందుకంటే వాళ్ళు ఉన్న ప్రొఫెషన్ అలాంటిది మరి. బాలీవుడ్ హాటీ సారా అలీ ఖాన్ మాల్దీవుల్లో మల్టీ-కలర్ కార్టూన్ ప్రింట్ బికినీలో తన లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. మళ్లీ ద్వీప దేశాలకు ఎగురుతూ హాలిడే ని బాగా ఎంజాయ్ చేస్తుంది.
అందాల ఆలియా భట్, టాలెంటెడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్లు… ఇద్దరూ స్టార్ కిడ్సే అయినప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీలో తమకంటూ సొంత గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డారు ఈ ముద్దుగుమ్మలు. కానీ, సారా అలీఖాన్ మాత్రం చేసింది రెండు సినిమాలే అయినా స్టార్ హీరోయిన్‌కు ఉండాల్సినంత క్రేజ్ సంపాదిచ్చేసింది. ఇక బాలీవుడ్‌లో సారాకు తిరుగులేదనే చెప్పాలి. మొదటి సినిమా షూటింగ్ అవుతుండగానే వరుసగా మూడు సినిమాలకు సంతకం చేసేసింది అందరిని ఒకెత్తు ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు సారా అలీఖాన్ చేతిలో రెండు బడా సినిమాలు ఉన్నాయి కూడా. ఆమె యాక్టింగ్‌పై జనాలు నోటికొచ్చిన కామెంట్స్ చేస్తున్నా.. తాను మాత్రం వరుసగా సినిమాలు చేసేస్తు నెగిటివిటీకి ఆమడ దూరం లో ఉంటున్నారు.
అయితే తాజాగా మాల్దీవు బీచ్ ల్లో విహరిస్తూ బికినీ తో తన అందచందాలని చూపిస్తూ సోషల్ మీడియా (ఇన్ స్టాగ్రామ్) ఖాతా లో పెట్టి కుర్రకారుని రెచ్చగొడుతుంది. ఒకవైపు సారా అందాలని పొగుడుతుంటే, మరో వైపు నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదెక్కడి ఘోరం, ముస్లిం అయ్యి ఉండి ఇలాంటి ఫోటోలు దిగడమే కాకుండా పబ్లిక్ లో పెట్టి పరువు తీస్తుంది అని విమర్శిస్తున్నారు. నెగిటివిటీ పట్టించుకోని సారా అలీఖాన్ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది.