
టాలీవుడ్ లో ‘బి. గోపాల్’కి ఒక చరిత్ర ఉంది, ఇప్పటి జనరేషన్ కి ఆయన ఎవరో ? ఏ సినిమాలు చేశాడో తెలియదు గానీ… ఆయన ఒకప్పటి టాలీవుడ్ కి ఇప్పటి రాజమౌళి లాంటి డైరెక్టర్. అయితే ఆయన గురించి తెలిసినవారికీ, బి.గోపాల్ అనగానే ఫ్యాక్షన్ సినిమాలు గుర్తుకువస్తాయి, ఆ మాటకొస్తే అసలు టాలీవుడ్ లో ఫ్యాక్షన్ సినిమాలకు ఆజ్యం పోసిన ఘనత బి. గోపాల్ దే. పైగా తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసిన ఆయన, దాదాపు అందరు స్టార్ హీరోలను డైరెక్ట్ చేసాడు.
కానీ వయసు పెరిగేకొద్దీ అందరి దర్శకులలానే బి. గోపాల్ కూడా ఫేడవుట్ అయిపోయాడు. ఎన్నో ఇండస్ట్రీ రికార్డ్స్ ను తిరగరాసిన సినిమాలను డైరెక్ట్ చేసినా.. బి.గోపాల్ కి ఎప్పుడూ గర్వం ఉండేది కాదు. ఆయన ఎప్పుడూ రచయితలను ఎక్కువుగా నమ్మేవారు. వాళ్ళు రాయబట్టే.. తానూ మంచి సినిమాలను తీయగలిగాను అని రచయితలను ఎక్కువగా గౌరవించేవారు. అందుకే మంచి కథ ఎప్పుడూ రాసినా.. పరుచూరి బ్రదర్స్ ఆ కథను ఓన్లీ బి.గోపాల్ కి మాత్రమే ఇచ్చేవాళ్ళు.
మంచి కథ దొరికినప్పుడు ఎలాగూ సినిమా మంచిగానే హిట్ అవుతుంది. కాబట్టి మంచి కథ రావాలి, అలా రావాలి అంటే.. రచయితలతో మంచిగా ఉండాలి.. ఇదే తన సక్సెస్ సీక్రెట్ అని ఓపెన్ గా చెప్పిన ఘనత బి.గోపాల్ ది. మరి ఇలాంటి గొప్ప డైరెక్టర్ మళ్ళీ డైరెక్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. మరి ఈ మెగా దర్శకుడు మళ్ళీ మెగా ఫోన్ పట్టుకుంటే.. ఏ హీరో సినిమా చేయడానికి ముందుకు వస్తాడో చూడాలి.
నిజానికి రెండు సంవత్సరాల క్రితమే బాలయ్య బాబు, గోపాల్ తో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా మధ్యలో ఆగిపోయింది. అయితే తన కెరీర్ లో ఆఖరు సినిమా గోపీచంద్ తో తీసిన ఆరడుగుల బులెట్ సినిమా. ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఇలా తన ఆఖరు సినిమా మధ్యలో ఆగిపోవడం ఇష్టం లేని ‘బి. గోపాల్’, ఒక మంచి సినిమాతో తన కెరీర్ కు వీడ్కోలు పలకాలనుకుంటున్నారు.