
మామూలుగా మనకు వీకెండ్ రాగానే సేదతీరుతాం.. మందు, విందు, చిందు వేసి హాయిగా శని, ఆదివారాలు ఎంజాయ్ చేస్తాం. ఇక సోమవారం వచ్చిందంటే మళ్లీ ఆఫీసులు, పనులు గట్రా ఉండనే ఉంటాయి.
అయితే మనమే కాదు.. మెగాస్టార్ చిరంజీవి సైతం తాను అగ్ర హీరోగా స్వింగ్ లో ఉన్న సమయంలో తన పిల్లల కోసం ప్రత్యేకంగా టైం కేటాయించేవారు. వారితో పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేసేవారు. అందరినీ డ్యాన్స్ చేయించి ఎంజాయ్ చేసేవారు.
మెగా స్టార్ చిరంజీవి 90వ దశకంలో తెలుగులో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకువెళుతున్న సమయంలో అస్సలు తీరిక ఉండేది కాదట.. కుటుంబంతో గడిపే సమయం కూడా లేకుండా రోజుకు రెండు మూడు సినిమాల షూటింగ్ లో పాల్గొనేవారు.
అయితే శని, ఆదివారాల్లాంటి వీకెండ్స్ లో మాత్రం చిరంజీవి ఎంజాయ్ చేసేవారు. తన పిల్లలు, తమ్ముడు నాగబాబు, బావమరిది అల్లు అరవింద్ పిల్లలందరినీ రప్పించి డ్యాన్స్ పోటీలు పెట్టేవారు. నాడు తీసిన ఓ అరుదైన వీడియోను తాజాగా చిరంజీవి షేర్ చేశాడు. అదిప్పుడు వైరల్ గా మారింది.
వీడియో కోసం క్లిక్ చేయండి