Shocking Look: ఒకప్పుడు కుర్రాళ్ళ కలల రాకుమారి…కానీ ఇప్పుడేంటి ఇలా ఉంది.. షాకింగ్ లుక్ వైరల్…

ఒక హీరోయిన్ మాత్రం తెలుగు, హిందీ సినిమాల్లో మంచి విజయాలను అందుకొని తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నారు.

Written By: Gopi, Updated On : April 30, 2024 4:43 pm

Ayesha Takia shocking look is viral

Follow us on

Shocking Look: కొంతమంది హీరోయిన్లు చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకుంటారు. ఇక అలాంటి వారు ఆ తర్వాత సినిమాల్లో నటించక పోయినప్పటికీ ఆ ఒక్క సినిమా తో వాళ్లు ఎప్పటికైనా జనాల్లో గుర్తుండిపోతారు. ఇక ఒక హీరోయిన్ మాత్రం తెలుగు, హిందీ సినిమాల్లో మంచి విజయాలను అందుకొని తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నారు.

ఆ తర్వాత కెరియర్ మంచి పీక్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. ఇక తను పెళ్లి తర్వాత సినిమాలో నటించేది లేదని తెగేసి చెప్పి తన ఫ్యామిలీ లైఫ్ ని చాలా బాగా లీడ్ చేస్తూ వస్తుంది. ఇక ఆ నటి ఎవరు అంటే ఆయేషా టాకీయా… తెలుగులో నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సూపర్ ‘ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన అందచందాలతో కుర్రాళ్ళు మతులు పోగొట్టిన ఈవిడ ఆ తర్వాత మరే తెలుగు సినిమాలో కూడా కనిపించలేదు.

కెరీర్ మొదట్లో ఫేమస్ సింగర్ పాల్గొని పాఠక్ రూపొందించిన ఒక వీడియో ఆల్బమ్ లో తను పాల్గొని ‘మేరీ చునార్ ఉద్ ఉద్ జాయే’ పాటలో త్రిషతో కలిసి నటించింది. ఇక అప్పుడు ఆమె వయసు 15 సంవత్సరాలు… దిల్ మాంగే మోర్, దోర్, నో స్మోకింగ్, వాంటెడ్ లాంటి బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది… ఇక తను రీసెంట్ గా తన కొడుకుతో కలిసి ఎయిర్ పోర్ట్ నుంచి వస్తున్న సమయంలో కెమెరా కంటికి చిక్కింది.

అది చూసిన చాలా మంది అభిమానులు ఏంటి అయేషా టాకీయా ఇలా అయిపోయింది అంటూ ఆమె మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్లింగ్స్ అయితే చేస్తున్నారు. ఇక దీనిపైన స్పందించిన ఆమె ‘ నేను సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చి దాదాపు 15 సంవత్సరాల పైన అవుతుంది. అప్పుడున్నట్టే ఎప్పుడూ ఉండాలంటే కుదరదు కదా అంటూ కౌంటర్ ఇచ్చింది…