
ఇండస్ట్రీలో ఒకరోజున్న పరిస్థితులు ఇంకొక రోజు ఉండవు. ఈరోజుకు ఆరోజు కొత్తదే. కొత్త అవకాశాలు, కొత్త సినిమాలు, కొత్త గవిజయాలు, కొత్త పరాజయాలు. ఇలా ఈరోజు ఆరోజే. అందుకే ఎప్పుడూ మనల్ని మనం రేపటి కోసం సిద్ధంగా ఉంచుకోవాలి అంటుంటారు స్టార్లు. కానీ కొందరు మాత్రం ఈ ఫార్ములాను ఫాలో అవకా నిన్నటిని ఊహించుకుని భవిష్యత్తును కష్టాల్లోకి నెట్టుకుంటుంటారు. ఫలితంగా అవకాశాలు కోల్పోయి ఇబ్బందులు పడుతుంటారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
అలా ఇబ్బందులు పడిన నటీమణుల్లో అవికా గోర్ ఒకరు. ‘చిన్నారి పెళ్లికూతురు’ ధారావాహికతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఆమె ‘ఉయ్యాలా’ జంపాల సినిమాతో కథానాయికగా మారి అలరించింది. ఆమె క్రేజ్ మూలానే ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమాలో ఆమెను చూసిన జనం భవిష్యత్తులో అవికా గోర్ స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా రెండేళ్లకు గాని ఆమెకు హిట్ దొరకలేదు.. ఆ తరవాత అయినా కుదురుకుందా అంటే లేదు.
Also Read: రాహుల్ సిప్లిగంజ్ ఎమోషనల్ పోస్టు.. పునర్నవి గురించేనా?
ఒక్క సినిమా చేసి సరిపెట్టుకుంది. ఇలా ఆమె కేరీర్ కష్టల్లో పడటానికి కారణం ఫిజిక్ మీద అవికా గోర్ నిర్లక్ష్యం. హీరోయిన్ అంటే చూడచక్కని శరీరాకృతి ఉండాలి. కానీ అవికా బొద్దుగా తయారైపోయింది. అదే ఆమెకు అవకాశాలు లేకుండా చేసింది. అలా అవకాశాలు లేక బాధపడుతున్న సమయంలో ఒకరోజు రాత్రి అద్దం ముందు నిల్చుని తనని తాను చూసుకుని ఎంతో ఏడ్చానని, ఆ రాత్రి మొత్తం కన్నీళ్ళతోనే గడిపానన్న అవికా గోర్ ఆ తరవాత పట్టుదలతో వర్కవుట్స్ చేసి నాజూగ్గా తయారై అదే అద్దం ముందు నిల్చుని నవ్వుకున్నానని చెప్పుకొచ్చింది.