Avatar 4 Rajamouli: నేడు ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ కెమరూన్ దర్శకత్వం వహించిన ‘అవతార్ 3 : ది ఫైర్ & యాష్'(Avatar 3 : The Fire & Ash) చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై డివైడ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ‘అవతార్’ కి వచ్చినంత జనాదరణ, ‘అవతార్ 2 : ది వే ఆఫ్ వాటర్’ చిత్రానికి రాలేదు. కానీ కమర్షియల్ గా చూస్తే పెద్ద హిట్. మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా దుమ్ము లేపేసింది. ఇక మన తెలుగు రాష్ట్రాల నుండి అయితే ఈ చిత్రానికి ఫుల్ రన్ లో వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా వచ్చాయి. అయినప్పటికీ కూడా ‘అవతార్ 3 : ది ఫైర్ & యాష్’ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి, కానీ ఇండియా లో మాత్రం రెండవ భాగానికి జరిగిన రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు.
‘అవతార్ 2’ కి మొదటి రోజు ఇండియా వైడ్ గా 130 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ ‘అవతార్ 3’ కి 45 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే మొదటి రోజున వచ్చాయి. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది అనే చెప్పొచ్చు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా విడుదలకు ముందే జేమ్స్ కెమరూన్ కొంతమంది ప్రముఖులకు , మీడియా మిత్రులకు ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ షోస్ ని వేసి చూపించాడు. ఆ ప్రముఖులలో మన టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి కూడా ఉన్నాడు. ఈ సినిమా ని చూసిన తర్వాత ఆయన జేమ్స్ కెమరూన్ తో వీడియో కాల్ మాట్లాడడం, అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అవ్వడం వంటివి మనమంతా చూసాము. ఈ వీడియో లో జేమ్స్ కెమరూన్ ఒక సందర్భం లో పొరపాటున నోరు జారుతాడు. దాన్ని పట్టుకొని సోషల్ మీడియా లో నెటిజెన్స్ ‘అవతార్ 4’ కి రాజమౌళి దర్శకత్వం వహించబోతున్నాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సరదాగా రాజమౌళి తో సంభాషిస్తూ ‘నేను మీ వారణాసి మూవీ సెట్స్ లోకి రావాలని అనుకుంటున్నాను, పులి మీద ఏదైనా సన్నివేశాలు తీస్తుంటే చెప్పండి, వచ్చి చూస్తాను’ అని అంటాడు. అందుకు రాజమౌళి మీరు రావడం మా మూవీ యూనిట్ కి మాత్రమే కాదు, టాలీవుడ్ మొత్తానికి గర్వకారణం గా ఉంటుంది సార్ అని అంటాడు. నాకు దర్శకత్వం లో కొన్ని టిప్స్ కూడా నువ్వు ఇవ్వాలి అని అంటాడు జామ్ కెమరూన్, అందుకు రాజమౌళి నవ్వగా, ఇది దృష్టిలో పెట్టుకొని ఉండు అని జేమ్స్ కెమరూన్ సమాధానం చెప్తాడు. అంటే దీని అర్థం ఏంటి, ‘అవతార్ 4’ కి దర్శకత్వం వహించమని జేమ్స్ కెమరూన్ పరోక్షంగా రాజమౌళి ని కోరుతున్నాడా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.