Anil Ravipudi : సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు. అందుకే స్టార్ హీరోలు సైతం వాళ్ల దర్శకత్వంలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగడం అనేది ఆషామాషీ వ్యవహారం అయితే కాదు. ఎందుకంటే ఇక్కడ ప్రేక్షకుల అభిరుచి మేరకు దర్శకులు సినిమాలను తీయాల్సి ఉంటుంది. ఏ ఒక్క ప్రేక్షకుడు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా అందరి ప్రేక్షకుల మైండ్ సెట్ ని దృష్టిలో ఉంచుకొని దర్శకుడు అంతర్మాదన పోరాటం చేస్తూ ఒక బెస్ట్ ప్రాడక్ట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సిన అవసరమైతే ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో మంచి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు సూపర్ సక్సెస్ అవుతుంటాయి. మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతుంటాయి. కానీ కొంతమంది దర్శకులు చేస్తున్న సినిమాల్లో ఒక్క సినిమా కూడా ప్లాప్ అవ్వకుండా మంచి విజయాలను సాధిస్తూ ముందుకు తీసుకెళుతున్న వారు కూడా ఉన్నారు. అందులో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటే, ఆయన తర్వాత స్థానం లో అనిల్ రావిపూడి ఉన్నారు…ఇక ఈయన చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం…ఇక ప్రస్తుతం ఆయన ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకి రాబోతున్నాడు. వెంకటేష్ హీరోగా వస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి భారీ సినిమాలను చేయడమే కాకుండా ఆ సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఆయన మంచి నటుడు కావడంతో తన హవా భావాలతోనే ప్రమోషన్స్ ని భారీ రేంజ్ లో చేయించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
అది ఏంటి అంటే అనిల్ రావిపూడి షూటింగ్ లొకేషన్ లో ఉన్నప్పుడు కొంతమంది అభిమానులు కర్రలు పట్టుకొని ఆయన్ని కొట్టడానికి వచ్చారు. అప్పుడు నటుడు శ్రీనివాసరెడ్డి వెళ్లి వాళ్లతో డిస్కషన్ చేస్తుండగా ఆ ఫ్యాన్స్ చెప్పిన సమాధానం ఏంటి అంటే? పొద్దున అనిల్ రావిపూడి కనిపిస్తే సినిమా పేరు ఏంటి అని అడిగాము…
‘సంక్రాంతికి వస్తున్నాం ‘ అంటూ చెప్పి వెళ్లిపోయాడు… నువ్వు సంక్రాంతికి వచ్చినా ఎప్పుడు వచ్చినా గాని సినిమా పేరు అయితే మాకు చెప్పాలే కదా అంటూ వాళ్ళు కోపానికి వస్తున్నప్పుడు నటుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అనిల్ రావిపూడి ఇప్పుడు వెంకటేష్ తో చేస్తున్న సినిమా పేరే ‘సంక్రాంతికి వస్తున్నాం’ అని చెప్పాడు. దాంతో వాళ్ళు ఒకసారి పొద్దున అనిల్ చెప్పింది సినిమా పేరా?
సంక్రాంతికి వస్తున్నామంటే సినిమాను సంక్రాంతి కి రిలీజ్ చేస్తున్నాం అని చెబుతున్నాడేమో అనుకున్నాం అంటూ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు .మొత్తానికైతే ఒక మంచి ప్రమోషన్ తో తమ సినిమా పేరుని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి అనిల్ రావిపూడి తీవ్రమైన ప్రయత్నమైతే చేశాడనే చెప్పాలి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది..
ఇది రా ప్రమోషన్ లు అంటే .. ఆడియన్స్ పల్స్ పట్టేసావ్ @AnilRavipudi #Sankranthikivasthunnam pic.twitter.com/beotyTjpEf
— H A N U (@HanuNews) December 15, 2024