https://oktelugu.com/

Hero Vijay : విజయకాంత్ కు నివాళి వేళ హీరో విజయ్ కి దారుణ అవమానం… మీద చెప్పులు వేసి, వీడియో వైరల్!

విజయ్ పైకి చెప్పి విసిరిన వ్యక్తిని పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు విజయ్ ఇటీవల లియో మూవీతో ప్రేక్షకులను పలకరించారు. లియో మిక్స్డ్ టాక్ మధ్య భారీ వసూళ్లు అందుకుంది.

Written By:
  • NARESH
  • , Updated On : December 29, 2023 / 08:29 PM IST
    Follow us on

    Hero Vijay : హీరో విజయ్ కి దారుణ అవమానం జరిగింది. ఆయన మీదకు ఒకరు చెప్పు విసిరారు. ఈ సంచలన వీడియో వైరల్ అవుతుంది. నటుడు, డిఎండీకే అధినేత విజయకాంత్ డిసెంబర్ 28న కన్నుమూశారు. మియత్ ఇంటరేషనల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. కరోనా కారణంగా విజయకాంత్ కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు. ఇక విజయకాంత్ ని చివరి చూపు చూసేందుకు వేలాది మంది అభిమానులు తరలి వచ్చారు.

    అలాగే ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఇక నటుడు విజయ్ రాకను తెలుసుకున్న అభిమానులు అక్కడకు భారీగా చేరుకున్నారు. ఆయన్ని చూసేందుకు ఎగబడ్డారు. విజయకాంత్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన విజయ్ ఎమోషనల్ అయ్యారు. అనంతరం ఆయన తన కారు వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు.

    గార్డ్స్, పోలీసులు ఉన్నా అదుపు చేయలేకపోయారు. వందల మంది విజయ్ వైపుకు దూసుకొచ్చి ఆయన్ని చూసే ప్రయత్నం చేశారు. దీంతో గందరగోళం నెలకొంది. ఈ గందరగోళం మధ్య ఎవరో విజయ్ మీదకు చెప్పు విసిరారు. అంత మంది జనాలు ఉన్న నేపథ్యంలో ఆయన మీద చెప్పు దాడి జరిగిన విషయం ఎవరూ గమనించలేదు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. విజయ్ మీద జరిగిన దాడికి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    విజయ్ పైకి చెప్పి విసిరిన వ్యక్తిని పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు విజయ్ ఇటీవల లియో మూవీతో ప్రేక్షకులను పలకరించారు. లియో మిక్స్డ్ టాక్ మధ్య భారీ వసూళ్లు అందుకుంది. నెక్స్ట్ ఆయన దర్శకుడు వెంకట్ ప్రభుతో ఒక చిత్రం చేస్తున్నారు. దీంతో మీనాక్షి చౌదరి హీరోయిన్. ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది.