
ఎన్టీఆర్ కొత్త సినిమా ఆగిపోయింది. ఆ సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ తో కొన్ని ఇబ్బందులు కారణంగా తన కొత్త సినిమాని ఎన్టీఆర్ పక్కన పెట్టాడు, లేదూ త్రివిక్రమ్ మహేష్ కి ఇచ్చిన మాట ప్రకారం, ఎన్టీఆర్ సినిమాని పోస్ట్ ఫోన్ చేసుకున్నాడు. ఇలా గత రెండు రోజులు నుండి సోషల్ మీడియాలో అనేక రకాలుగా ఎన్టీఆర్ సినిమా పై వార్తలు వస్తూనే ఉన్నాయి. మరి వీటిల్లో ఎంత నిజం ఉందనే విషయాన్ని పక్కన పడితే.. ఎన్టీఆర్ తన తర్వాత సినిమాని మాత్రం తమిళ దర్శకుడితో చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడని ఎన్టీఆర్ సన్నిహితుల దగ్గర నుండి వస్తోన్న సమాచారం.
ఇంతకీ ఎన్టీఆర్ ఆసక్తి చూపిస్తోన్న ఆ తమిళ దర్శకుడు ఎవరు అంటే.. అట్లీ. నిజానికి అట్లీతో ఎన్టీఆర్ సినిమా చేసే అవకాశాలున్నాయని గత నాలుగేళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. పైగా గతంలో ఎన్టీఆర్‌తో అట్లీ పలుమార్లు కథ చెప్పడం కోసం సమావేశమయ్యాడు కూడా. కానీ, ఎందుకో ఎన్టీఆర్ కి ఏ కథ నచ్చలేదు. కథ నచ్చినప్పుడు.. వేరే సినిమాలతో బిజీ కారణంగా ఈ కాంబినేషన్ లో సినిమా కబురు బయటకు రాలేకపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా త్వరలోనే వీరి కలయికలో ఫలానా సినిమా వస్తుంది అంటూ అధికారిక ప్రకటన రానుందట.
పైగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత యంగ్ టైగర్ చేయబోయే సినిమా కావడంతో అట్లీ కూడా ఈ సినిమా పై తెగ ఆసక్తి చూపిస్తున్నాడట. ఇక మొదటినుండి ఎన్టీఆర్ కి అట్లీ పై నమ్మకం ఎక్కువ. తమిళంలో అట్లీ సినిమా విడుదలైన ప్రతిసారీ ఎన్టీఆర్ నుండి అతనికి ఫోన్ వెళ్తుందట. సినిమా చూశానని, చాలా బావుందనీ అట్లీని ఎన్టీఆర్ ఎప్పుడూ మెచ్చుకుంటారట. ఎన్టీఆర్ చాలా స్వీట్ హార్ట్ అంటూ విజిల్ ఆడియో ఫంక్షన్ లో అట్లీ చెప్పినట్టు గుర్తు. ఈ లెక్కన వీరి మధ్య మంచి అండర్ స్టాడింగ్ కూడా ఉంది కాబట్టి.. కథ కూడా ఈజీగా ఫైనల్ అయిపోతుంది. ప్రస్తుతం హిందీలో షారుక్‌ఖాన్‌తో అట్లీ సినిమా చేస్తున్నాడు.
Comments are closed.