Athadu Re Release Box Office: మన టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ పూర్తి స్థాయిలో మొదలైంది సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) ‘పోకిరి’ సినిమాతో. రీ రిలీజ్ లో సంచలనం సృష్టించిన ఈ సినిమా తర్వాత ప్రతీ స్టార్ హీరో సినిమా రీ రిలీజ్ అవ్వడం మొదలైంది. కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కడే మహేష్ పాత సినిమాల రీ రిలీజ్ రికార్డ్స్ ని బద్దలు కొట్టేవాడు. వీళ్లిద్దరి మధ్య రికార్డ్స్ తిరుగుతూ ఉండేవి. ప్రస్తుతానికి మొదటి రోజు ఆల్ టైం రికార్డు గ్రాస్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ పేరిట ఉంటే, ఫుల్ రన్ రికార్డు ‘ఖలేజా’ చిత్రం పేరిట ఉంది. అయితే నిన్న మహేష్ 50 వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఆయన కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ గా నిల్చిన ‘అతడు'(Athadu Movie) చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. విడుదలకు ముందు ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉండేవి.
Also Read: మహేష్ బాబు లుక్ తో సినిమా కథ మీద క్లారిటీ ఇచ్చిన రాజమౌళి…
అతడు అంటే ప్రతీ ఒక్కరికి ఎంతో ఇష్టమైన సినిమా, టీవీ టెలికాస్ట్ లో ప్రభంజనం సృష్టించిన సినిమా, కాబట్టి ఈ సినిమాతో మొదటి రోజు గబ్బర్ సింగ్ రికార్డుని బద్దలు కొట్టి, ఫుల్ రన్ లో 30 కోట్ల రూపాయిలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అభిమానులు బలమైన నమ్మకం తో ఉండేవారు. కానీ చివరికి ఈ చిత్రం కనీసం ‘ఖుషి’ మొదటి రోజు వసూళ్లను కూడా దాటలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ థియేటర్స్ ఖాళీగానే ఉన్నాయి. వైజాగ్, విజయవాడ వంటి ప్రాంతాల్లో మంచి కలెక్షన్స్ నమోదు అయ్యాయి కానీ, మిగిలిన ప్రాంతాల్లో బాగా మిస్ ఫైర్ అయ్యింది. ఫలితంగా కేవలం మూడు కోట్ల రూపాయిల వరల్డ్ వైడ్ గ్రాస్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది చాలా దారుణం అనే అనుకోవాలి. ఎందుకంటే పండగ సెలవుల్లో విడుదలైన సినిమా.
Also Read: నీ గొప్ప మనసుకు సలాం.. రియల్ హీరో అనిపించుకున్నావ్
పబ్లిసిటీ నెల రోజుల ముందు నుండే ఒక రేంజ్ లో మొదలు పెట్టారు. ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ కూడా బలంగా చేయించారు. కానీ ఆడియన్స్ ఆదరించలేదు. కారణం ఈ చిత్రాన్ని కొన్ని వందల సార్లు టీవీ లలో చూసి ఉంటారు ఆడియన్స్. అన్ని సార్లు చూసిన తర్వాత మళ్ళీ థియేటర్ కి వెళ్లి సమయాన్ని ఎలా వృధా చేస్తారు చెప్పండి. అభిమానుల్లో ఈ సినిమా గురించి ఎక్కువ ఊహించుకొని నిరాశకు గురయ్యారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మూడు కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. అంటే కచ్చితంగా మూడు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాలి. అది అసాధ్యం. కాబట్టి నష్టాలు తప్పేలా లేవు. అదే కనుక జరిగితే రీ రిలీజ్ లో నష్టాలను తెచ్చిపెట్టిన మొట్టమొదటి సినిమాగా నిలిచిపోతుంది.