https://oktelugu.com/

Astrologer Venu Swamy: వేణు స్వామి నటుడన్న విషయం మీకు తెలుసా? మహేష్ మూవీతో పాటు ఆయన నటించిన చిత్రాలు ఇవే!

రెండు సినిమాల్లో వేణు స్వామి నటించాడు. ఆ రెండు సినిమాల్లోనూ ఆయన పూజారిగా కనిపించడం విశేషం. ఆ వీడియో క్లిప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి

Written By:
  • S Reddy
  • , Updated On : May 2, 2024 / 11:58 AM IST

    Astrologer Venu Swamy Acted in Many Movies

    Follow us on

    Astrologer Venu Swamy: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి పరిచయం అక్కర్లేని పేరు. వరుస ఇంటర్వ్యూలతో వివాదాలు రాజేస్తూ ఉంటాడు. ముఖ్యంగా స్టార్ హీరోలను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటాడు. వేణు స్వామి కామెంట్స్ వైరల్ అవుతున్న నేపథ్యంలో యూట్యూబ్ ఛానల్స్ ఆయన వెంటపడుతున్నాయి. హాట్ కామెంట్స్ తో నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా అతనిలోని మరో కోణం బయటపడింది. వేణు స్వామి నటుడు కూడాను. ఆయన నటించిన చిత్రాలు ఏమిటో చూద్దాం…

    రెండు సినిమాల్లో వేణు స్వామి నటించాడు. ఆ రెండు సినిమాల్లోనూ ఆయన పూజారిగా కనిపించడం విశేషం. ఆ వీడియో క్లిప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి జగపతి బాబు హీరోగా నటించిన ‘ జగపతి ‘ చిత్రంలో పూజారిగా కనిపించాడు. ఒక సన్నివేశంలో జగపతి బాబు… ‘ గుళ్లో తిరునాళ్లకు డబ్బులు బాగా పోగయ్యాయటగా’ అని వేణు స్వామిని అడుగుతాడు. ‘అవునండి’ అని పూజారిగా ఉన్న వేణు స్వామి సమాధానం చెబుతాడు. ‘అన్నీ పోలీస్ స్టేషన్ కి పంపించు’ అని జగపతి బాబు అంటాడు.

    ఆ సీన్ లో హీరోయిన్ కూడా ఉంటుంది. ‘చూశావా అమ్మ దారుణం. ఎవరైనా తప్పు చేసి గుడికి వస్తారు. కానీ ఇతను గుళ్లోనే తప్పు చేయిస్తున్నాడు’ అని వేణు స్వామి హీరోయిన్ తో అంటాడు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో వేణు స్వామి కనిపించాడు. అతడు సినిమాలోని ‘పిలిచినా రానంటావా .. కలుసుకోలేనంటావా ‘ సాంగ్ లో మరోసారి పూజారిగా మెరిశాడు. నూతన వధూవరులకు పెళ్లి చేసే సీన్ లో అక్షింతలు చల్లుతూ కనిపిస్తాడు.

    ఈ వీడియో క్లిప్స్ వైరల్ చేస్తూ మీమ్స్ తో నెటిజన్లు రెచ్చిపోతున్నారు. వేణు స్వామి పై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా వేణు స్వామి ఈ మధ్య భార్య వీణ శ్రీవాణి తో కలిసి రీల్స్ చేస్తూ సందడి చేస్తున్నాడు. తన నటనా ప్రావీణ్యం బయటకు తీస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన నటించిన చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. టీనేజ్ నుండి వేణు స్వామికి టాలీవుడ్ తో పరిచయాలు ఉన్నాయి. పలు చిత్రాల పూజా కార్యక్రమాలు ఆయన చేతుల మీదుగా జరిగాయి.