Aasif Sheikh recalls Salman Khan: సల్మాన్ ఖాన్ ను చొక్క విప్పమన్న పోలీస్.. ఆసక్తికర విషయాలు పంచుకున్న ఆసిఫ్ షేక్..

బాబీజీ ఘర్ పర్ హైన్ ఫేమ్ ‘ఆసిఫ్ షేక్’ సల్మాన్ ఖాన్ తో కలిసి 1998లో ‘బంధన్‌’ సినిమాలో నటించారు. ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. ఒకరోజు సల్మాన్ తనను డ్రైవ్ కోసం తీసుకెళ్లి,

Written By: Mahi, Updated On : October 18, 2024 1:18 pm

Aasif Sheikh recalls Salman Khan

Follow us on

Aasif Sheikh recalls Salman Khan: బాలీవుడ్ మంచి క్రేజ్ ఉన్న నటుల్లో సల్మాన్ ఖాన్ ముందుంటారు. అతని ఫ్యాన్ ఫాలోయింగ్ మరే హీరోకు ఉండదంటే అతిశయోక్తి కాదు. పెద్ద పెద్ద వివాదాల్లో చిక్కుకున్నా నవ్వుతూ ఉండడమే ఆయన స్పెషల్. అప్పట్లో ఆయనపై వచ్చిన వివాదాలు మామూలువి కాదు. హిట్ అండ్ రన్ కేసు నుంచి కృష్ణ జింక మరణం వరకు చాలా కేసులు ఎదుర్కొన్నారు సల్మాన్. కృష్ణ జింక ను చంపిన కేసులో కోర్టు నిర్ధోషి అని ధ్రువీకరించినా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మాత్రం ఇంకా సల్మాన్ ను వెంటాడుతూనే ఉంది. ఇవన్నీ పక్కన పెడితే సల్మాన్ ఖాన్ తన సుదీర్ఘ కెరీర్ లో ఎంతో మందితో కలిసి పని చేశారు. వారంతా అప్పుడప్పుడు ఆయన గురించి విషయాలను మీడియా ముందు పంచుకుంటారు. అలాంటి వారిలో ఆసిఫ్ షేక్ ఒకరు. బాబీజీ ఘర్ పర్ హైన్ ఫేమ్ ‘ఆసిఫ్ షేక్’ సల్మాన్ ఖాన్ తో కలిసి 1998లో ‘బంధన్‌’ సినిమాలో నటించారు. ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. ఒకరోజు సల్మాన్ తనను డ్రైవ్ కోసం తీసుకెళ్లి, ఫుట్‌పాత్‌పై డ్రైవ్ చేసి, ట్రాఫిక్ పోలీసులకు ఎలా చిక్కుకున్నాడు.. అప్పుడు వారు ఏం చేశారన్న విషయాలను పంచుకున్నాడు.

ది లాలాంటాప్‌ చానల్ తో ఆసిఫ్ మాట్లాడుతూ ‘అప్పట్లో మేం చిన్నవాళ్లం, ఆ సమయంలో బ్యాక్ టు బ్యాక్ హిట్లు రావడం వల్ల సల్మాన్‌కు దేశ వ్యాప్తంగా గౌరవం ఎక్కువగా ఉండేది. కారులో నన్ను తన పక్కన కూర్చోబెట్టి, ఫుట్‌పాత్, రోడ్డుపై ఎక్కడికైనా డ్రైవింగ్ చేయడం ఎలా అనేది నేర్పించాడు. ఆ సమయంలో నేను ఇలా చెప్పాను ‘సల్మాన్, పక్డే జాయేంగే (మేము పట్టుబడతాము) అతను, ‘పక్డే జాయేంగే తో యార్ సల్మాన్ ఖాన్ హై, ఘబ్రావ్ మత్’ (పట్టుబడినా, చింతించవద్దు. మీరు సల్మాన్ ఖాన్‌తో ఉన్నారు)’ అన్నాడు. ఫుట్ పాత్ పై ముందుకు వెళ్తుండగా.. ట్రాఫిక్ పోలీసులు మా వాహనాన్ని ఆపారు. సైడ్ మిర్రర్ దింపడంతో పోలీస్ లోపలికి చూశాడు. కానీ సల్మాన్ ఖాన్ ను గుర్తు పట్టలేదు.

‘అతను సైడ్ మిర్రర్ నుంచి లోపలికి చూశాడు. నేను సల్మాన్ మాత్రమే ఉన్నాం. ట్రాఫిక్ పోలీసులు సల్మాన్ ఖాన్ ను గుర్తించలేదు.’ అప్పుడు నేను అన్నాను అప్పుడు అతను మిమ్మల్ని గుర్తించవచ్చు),’ అని ఆసిఫ్ నవ్వుతూ చెప్పాను. ఈ విషయాను చెప్పాడు.

హైదరాబాద్‌లో 1997లో ‘ఔజార్’ చిత్రీకరణ సమయంలో మరో సంఘటనను వివరించాడు. ‘హైదరాబాద్ లోని నా స్నేహితుడు కొత్త కారును కొన్నాడు. నన్ను కలిసేందుకు షూటింగ్ సెట్ కు వచ్చాడు. అయితే అక్కడే ఉన్న సల్మాన్ ఖాన్ నా ఫ్రెండ్ కారును నడపాలని పట్టుబట్టాడు. నా స్నేహితుడు కొత్త కారు గురించి ఆందోళన చెందుతూ వేగంగా నడపద్దని కోరాడు. కానీ సల్మాన్ మాట వినలేదు. అందరం హోటల్‌కు చేరుకున్న తర్వాత, సల్మాన్ ఆసిఫ్, అతని స్నేహితుడిని ఆటపట్టించి, కారు ప్రయాణం గురించి అడిగాడు సల్మాన్.

‘సల్మాన్ తో కలిసి పని చేయడం సెట్‌లో పార్టీ చేసుకోవడం లాంటిది. ఫ్యాన్స్, ప్రజలు అతన్ని ఎలా గుర్తిస్తారో నాకు తెలియదు. కానీ అతను చాలా మంచి వ్యక్తి. అతను పూర్తిగా భిన్నమైన లీగ్‌లో ఉంటాడు. మీరు సల్మాన్‌తో ఎవరీని పోల్చలేరు. అతన్ని మీరు తిట్టాలనుకున్నా.. అతను మిమ్మల్ని మెచ్చుకుంటూనే ఉంటాడు.

కరణ్ అర్జున్ (1995), ఔజార్ (1997), దిల్ నే జిసే అప్నా కహా (2004), షాదీ కర్కే ఫాస్ గయా యార్ (2006), భరత్ (2009) వంటి అనేక చిత్రాలలో ఆసిఫ్ షేక్ సల్మాన్‌తో కలిసి నటించారు.