https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: నన్ను ఏకాకిని చేశారు… నాగార్జునతో మొరపెట్టుకున్న అశ్విని!

ప్రశాంత్ కొన్ని సార్లు అసలు మాట వినడు సార్ అంటూ చెప్పింది. వెంటనే నాగార్జున నీకు మిమిక్రీ చేయడం వచ్చా .. నువ్వు శివాజీ అన్న లాగా మిమిక్రీ చేసి చెప్పు ఏదైనా వింటాడు అంటూ జోక్ చేశారు.

Written By: , Updated On : November 26, 2023 / 04:23 PM IST
Bigg Boss 7 Telugu

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ 12వ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది అశ్విని. ఈసారి డబల్ ఎలిమినేషన్ కావడంతో శనివారం నాటి ఎపిసోడ్ లోనే అశ్విని ని ఎలిమినేట్ చేశారు. అయితే నిన్న షో టైం అయిపోవడంతో నేడు అశ్విని స్టేజి మీదకు రానుంది. కాగా తాజా ప్రోమోలో అశ్విని ని స్టేజి పైకి ఇన్వైట్ చేశాడు నాగార్జున. అశ్విని నువ్వు వెళ్లే ముందు హిట్ ఎవరు ప్లాప్ ఎవరు హౌస్ లో చెప్పేసి వెళ్ళు అని అడిగారు.

దీనితో అశ్విని ‘ప్రశాంత్ కొన్ని సార్లు అసలు మాట వినడు సార్ అంటూ చెప్పింది. వెంటనే నాగార్జున నీకు మిమిక్రీ చేయడం వచ్చా .. నువ్వు శివాజీ అన్న లాగా మిమిక్రీ చేసి చెప్పు ఏదైనా వింటాడు అంటూ జోక్ చేశారు. ఇక తర్వాత యావర్ హిట్ అని చెప్తూ .. నాకు మంచి ఫ్రెండ్ సార్ .. మంచి ఫ్రెండ్ ని తీసుకెళ్తున్నాను బిగ్ బాస్ హౌస్ నుంచి అనుకుంటున్నాను అని అశ్విని చెప్పింది.

తర్వాత అశ్విని .. ప్రియాంక గురించి నా దృష్టి లో అయితే ఫ్లాప్ సార్. ఎందుకంటే మంచిదే గాని తొందర ఎక్కువ .. అన్నిటికి ఓవర్ రియాక్ట్ అవుతుంది అని చెప్పింది. తర్వాత హౌస్ ఉన్న స్పా బ్యాచ్ .. స్పై బ్యాచ్ గురించి మాట్లాడింది. సార్ ఇంట్లో రెండు గ్రూపులుగా డివైడ్ అయిపోయారు. అమర్ దీప్, శోభా, ప్రియాంక ఒక గ్రూప్ .. శివాజీ, యావర్, ప్రశాంత్, రతిక ఒక గ్రూప్. నేను ఏ గ్రూప్ లో కలవలేక .. ఏకాకిలా ఏం చెయ్యాలో తెలియక ఇలా అయిపోయాను సార్ అన్నది అశ్విని.

ఇంతలో అర్జున్ ఆ ఏకాకి గ్రూప్ లో కూడా నేను లేనా అంటూ అడిగాడు. అయితే నాగార్జున కలగజేసుకుని .. నువ్వు అంటే భయం కదా .. ఏమన్నా అంటే ఎం చేస్తావో అని భయం అంటూ పంచ్ వేశారు. ఇక ప్రోమో చివర్లో నాగార్జున వేసిన పంచ్ మాములుగా లేదు. చుక్క బ్యాచ్ .. మొక్క బ్యాచ్ ..మధ్యలో తొక్క బ్యాచ్ అంటూ తెగ నవ్వించారు హోస్ట్ నాగార్జున.

Bigg Boss Telugu 7 Promo 1 - Day 84 | Nagarjuna's Post Elimination Task for Ashwini Shree | Star Maa