Deepika Padukone: రెండు రోజులుగా హీరోయిన్ దీపికా పదుకొనె ఆరోగ్యంపై రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న ఆమె ప్రాజెక్ట్ కె షూటింగ్ లో సరిగా పాల్గొనలేకపోతున్నారన్న కథనాలు వెలువడుతున్నాయి. ప్రాజెక్ట్ కె సెట్స్ లో దీపికా అనారోగ్యానికి గురికాగా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దీర్ఘకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్న దీపికా పానిక్ అటాక్ కి గురికావడంతో బీపీ సమస్యలు ఏర్పడ్డాయనేది కథనాల సారాంశం. ఈ క్రమంలో ప్రభాస్ అసహనానికి గురవుతున్నారట. దీపికా ఆరోగ్యం కుదుటపడే వరకు షూటింగ్ ఆపేయాలన్నారట. దీంతో ప్రాజెక్ట్ కె షూటింగ్ ఆగిపోయిందనేది టాలీవుడ్ వర్గాల్లో నడుస్తున్న చర్చ.
ఈ వార్తలపై ప్రాజెక్ట్ కె నిర్మాత అశ్వినీదత్ స్పందించారు. ప్రాజెక్ట్ కె షూటింగ్ ఆగిపోయిందన్న వార్తలను ఆయన ఖండించారు. దీపికాకు బీపీ సమస్యలు ఉన్నాయి. ఆ కారణంగానే ఆమెను ఓ రోజు హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం దీపికా ఆరోగ్యంగా ఉన్నారు. షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు. అమితాబ్ బచ్చన్, దీపికా పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాము. దీపికా అనారోగ్యం కారణంగా ప్రాజెక్ట్ కె షూటింగ్ ఆగిందంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు, అంటూ ఆయన వివరణ ఇచ్చారు.
Also Read: Allu Arjun Craze: బడా హీరోలకే దిమ్మదిరిగేలా బన్నీకి క్రేజ్
ఇలాంటి వార్తలు సినిమా ఫలితంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. జనాల్లో సినిమా పట్ల నెగిటివ్ ఒపీనియన్స్ కలిగేలా చేస్తాయి. అందుకే అశ్వినీదత్ నష్టనివారణా చర్యలు చేపట్టారు. ఇక ప్రాజెక్ట్ కె సైన్స్ ఫిక్షన్ జోనర్ లో పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతుంది. దాదాపు రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది. 2024 లో ప్రాజెక్ట్ కె విడుదల కానుంది. ఈ చిత్రంలో ఉపయోగించే కార్లకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం అందించాల్సిందిగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను దర్శకుడు నాగ్ అశ్విన్ కోరడం విశేషం. తన ఇంజనీర్స్ సహాయం ఆయనకు ఉంటుందని ఆనంద్ మహీంద్ర మాటివ్వడం జరిగింది. ఈ మూవీపై పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి.
Also Read:Karan Johar: కెజిఎఫ్ 2 మేము తీస్తే మాత్రం నచ్చదు… కరణ్ జోహార్ సంచలన ఆరోపణలు