https://oktelugu.com/

Ashu Reddy: పబ్లిసిటీ కోసం బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి పాడు పనులు… ఎన్ని విమర్శలు వచ్చినా అదే తీరు!

పబ్లిసిటీ కోసం ఎంతకైనా తెగిస్తుంది అషురెడ్డి. గతంలో ఆమె చేసిన పనులు పలుమార్లు వివాదాస్పదం అయ్యాయి. అషురెడ్డి చర్యలపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆమె పట్టించుకోవడం లేదు. తాజాగా అషురెడ్డి చేసిన పనికి నెటిజెన్స్ మండిపడుతున్నారు. ఆమె ఏం చేశారో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : August 19, 2024 / 12:13 PM IST

    Ashu Reddy

    Follow us on

    Ashu Reddy: టిక్ టాక్, యూట్యూబ్ వీడియోలు చేస్తూ అషురెడ్డి పాపులారిటీ రాబట్టింది. డబ్ స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో జూనియర్ సమంతగా క్రేజ్ దక్కించుకుంది. ఆ క్రేజ్ తో బిగ్ బాస్ సీజన్ 3లో అడుగుపెట్టింది. గ్లామర్ నే నమ్ముకున్న అషురెడ్డి హౌస్ లో ఎక్కువ కాలం రాణించలేదు. అయితే గతంతో పోల్చితే అషు రెడ్డి ఫేమ్ రెట్టింపు అయ్యింది. బిగ్ బాస్ తర్వాత పలు బుల్లితెర షోల్లో అషురెడ్డి సందడి చేసింది. కొన్ని సినిమాల్లో కూడా అషు నటించడం విశేషం. చల్ మోహన్ రంగ, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్, ఫోకస్ చిత్రాల్లో అషురెడ్డిని మనం చూడొచ్చు.

    సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అషురెడ్డిని ఇంటర్వ్యూ చేశాడు. ఈ బోల్డ్ ఇంటర్వ్యూ అప్పట్లో సెన్సేషన్ అయింది. మరోవైపు పొట్టి బట్టల్లో నెట్టింట అషు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. హాట్ ఫోటోలతో సోషల్ మీడియాని హీటెక్కిస్తూ ఉంటుంది. ప్రస్తుతం అషు రెడ్డి చేతిలో పలు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న యేవమ్ సినిమాలో ఓ బోల్డ్ రోల్ లో నటిస్తుంది. ఇటీవల ఈ మూవీ నుండి అషు రెడ్డి లుక్ కూడా రిలీజ్ చేశారు.

    అషురెడ్డి నిరంతరం పబ్లిసిటీ కోరుకుంటుంది. అందుకే ఏం చేసేందుకైనా వెనుకాడదు. ప్రెగ్నెన్సీ వచ్చిందని తల్లితో ఫ్రాంక్ చేసిన అషురెడ్డి ఆ వీడియో యూట్యూబ్ లో షేర్ చేసింది. దీనిపై నెటిజెన్స్ మండిపడ్డారు. ఇక వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూల గురించి ఇంత చెప్పినా తక్కువే. సభ్య సమాజం సిగ్గుపడేలా వర్మ-అషురెడ్డి బూతు టాపిక్స్ చర్చించారు. ఆ ఇంటర్వ్యూల వలన అషురెడ్డికి ఒరిగిందేమీ లేదు.

    ఆ మధ్య నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ అమ్ముతో అడ్డంగా బుక్ అయ్యాడు. కేపీ చౌదరితో అషురెడ్డికి స్ట్రాంగ్ రిలేషన్ ఉన్నట్లు విచారణలో తేలింది. పదుల సంఖ్యలో అషురెడ్డి-కేపీ చౌదరి మధ్య ఫోన్ సంభాషణలు ఉన్నాయట. అషురెడ్డి సైతం విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని ప్రచారం జరిగింది. తనకు డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని అషురెడ్డి వివరణ ఇచ్చింది. నిరాధార కథనాలు ప్రచారం చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటానని బెదిరించింది.

    తాజాగా అషు రెడ్డి వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేస్తున్న ఫోటోలు షేర్ చేసింది. ఇవి వైరల్ అవుతున్నాయి. సదరు ఫోటోలు వివాదాస్పదంగా ఉన్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయి. ఇందుకు కారణం అషు రెడ్డి వేసుకున్న డ్రెస్. హాట్ డ్రెస్ లో అషు రెడ్డి పూజ చేస్తూ కనిపించడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు.

    దేవుడి పూజ చేస్తూ అవేం బట్టలు. నువ్వు చేస్తున్న పూజ ఏంటి వేసుకున్న డ్రెస్ ఏంటి అని ట్రోల్ చేస్తున్నారు. కనీసం ఇలాంటప్పుడైనా మంచి బట్టలు వేసుకోవచ్చు కదా అని నెటిజన్లు అషు రెడ్డి ని ఏకి పారేస్తున్నారు. మోడ్రన్ డ్రెస్ ధరించి పూజలు చేసే విమర్శలు ఎదురవుతాయని అషురెడ్డికి తెలుసు. కానీ ఆమెకు పబ్లిసిటీ కావాలి. తన గురించి నలుగురు మాట్లాడుకోవాలి. అందుకే అషురెడ్డి ఇలా చేసింది.