Ashu Reddy controversy : గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వినిపిస్తున్న పేరు అషు రెడ్డి. ఈమె సోషల్ మీడియా సెలబ్రిటీ , బిగ్ బాస్ కంటెస్టెంట్ గా బాగా పాపులర్. ఈమధ్య కాలం లో కొన్ని టీవీ షోస్ లో కూడా కనిపిస్తోంది. పలు సినిమాల్లో కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్ లో మెరిసింది. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ తో ఈమె చేసిన ఇంటర్వ్యూ ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో మనమంతా చూసాము. అయితే రీసెంట్ గానే ఈమెపై ధర్మేంద్ర అనే వ్యక్తి కేసు నమోదు చేయడం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. పెళ్లి చేసుకుంటానని నా దగ్గర కోట్ల రూపాయిల డబ్బులు దోచేసింది , కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోవడం లేదని , డబ్బులు తిరిగి అడిగితే ఇవ్వడం లేదని ఆయన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. దీనిపై అషు రెడ్డి చాలా ఘాటుగానే రెస్పాన్స్ ఇచ్చింది.
తనపై గత రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారాలు పూర్తిగా ఫేక్. నిజానిజాలు తెలుసుకోకుండా నాపై అసత్య ప్రచారాలు చేసిన ఏ ఒక్కరిని వదలను , చట్టపరమైన చర్యలు తీసుకుంటాను , రెడీ గా ఉండండి అంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పెట్టింది. అంతే కాకుండా ఆమె తెలంగాణ హై కోర్టు ని ఆశ్రయించి , తన వెర్షన్ వినకుండానే పోలీసులు కేసు నమోదు చేసారని , ఈ కేసు ని కొట్టివేయాల్సిందిగా పిటీషన్ దాఖలు చేసింది. మరోపక్క వై వీ ధర్మేంద్ర ఆధారాలను వరుసగా విడుదల చేస్తున్నాడు. ముందుగా ఆయన అషురెడ్డి కి 9 కోట్ల రూపాయిల డబ్బులు పంపినట్టు , బ్యాంక్ స్టేట్మెంట్స్ మీడియా కి విడుదల చేశాడు. అనంతరం నేడు అషు రెడ్డి కి సంబంధించిన ఆడియో రికార్డుని కూడా సోషల్ మీడియా లో లీక్ చేసాడు. ఈ ఆడియో లో అషు రెడ్డి ధర్మేంద్ర ని బెదిరిస్తోంది.
అందుకు సంబంధించిన ఆడియో రికార్డుని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఆమె మాట్లాడుతూ ‘నేను ఇప్పుడు నీకు మళ్లీ చెప్తున్నాను , మే నెల వరకు సమయం ఇస్తే 1 కోటి 50 లక్షల రూపాయిలు తిరిగి ఇచ్చేస్తాను. అది కూడా ఆన్లైన్ ద్వారా నీ అకౌంట్ కి ట్రాన్స్ ఫర్ చేస్తాను. మిగిలిన డబ్బులు నేను జీవితం లో స్థిరపడినప్పుడు ఇస్తాను , ఇవ్వను అనడంలేదు. లేదు , కుదరదు అంటే , నా జీవితం లో పెద్ద మనిషి ప్రవీణ అక్క మాత్రమే, ఆమెతో పాటు వేణు స్వామి కూడా వస్తాడు, నీ తరుపున మనుషులను కూడా నీతో పాటు తీసుకునిరా, నేనింకా నీ ముఖం చూడాలని అనుకోవడం లేదు , మే వరకు టార్గెట్ పెట్టాను , అప్పటి లోపు నీకు డబ్బులు తిరిగి ఇవ్వాలి అంతే, కుదరదు అంటే నేనే నీ మీద హరాస్మెంట్ కేసు పెడతాను’ అంటూ ఆమె స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
వై.వి.ధర్మేంద్ర మీద తిరిగి కేసు పెడతానని బెదిరించిన అషు రెడ్డి
మే నెల వరకు సమయమిస్తే రూ.1.5 కోట్లు ఇస్తాను.. మిగతా డబ్బులు నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాను అప్పటివరకు ఆగు
లేకపోతే నేను కూడా నీ మీద హరాస్మెంట్ కేసు పెడతాను అంటూ ధర్మేంద్రకు అషు రెడ్డి వాయిస్ మెసేజ్ https://t.co/6CGp2m12eX pic.twitter.com/MgHYZ4V68j
— Telugu Scribe (@TeluguScribe) April 28, 2026
