Asha Bhosle Life Story Struggles: ఆమె పాడుతుంటే కోయిలలు శ్రద్ధగా వింటాయి. ఆమె గజల్ సరికొత్త ఉత్సాహం ఇస్తుంది. ఆమె మెలోడీ ఆనంద విహారం చేయిస్తుంది. ఆమె ట్రాజెడీ కన్నీటి చారికలను ప్రవహించేలా చేస్తుంది. ఒకటా రెండా.. లెక్కకు మిక్కిలి ప్రయోగాల. ఆమె గొంతులో ఏముందో తెలియదు. ఆమె గాత్రంలో ఏ మహత్తు దాగి ఉందో తెలియదు. గొంతు దాటిన పాట కోట్లాదిమందిని రంజింపజేసింది. తన మాట ఎంతోమందిలో స్ఫూర్తిని కలిగించింది. అలాంటి సంగీత సరస్వతి.. పాటల మంజరి ఆశా భోంస్లే.. కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇక సెలవంటూ కోట్లాదిమంది అభిమానులను దుఃఖంలో ముంచేస్తూ సెలవు తీసుకున్నారు..
ఆశా భోంస్లే జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఆమె యుక్త వయసులో ఉన్నప్పుడే ప్రేమలో పడ్డారు. ఆమె ప్రేమను చాలామంది వ్యతిరేకించారు. కుటుంబ సభ్యులు వద్దన్నారు. అయినప్పటికీ ప్రేమించిన వాడే లోకంగా ఆమె బయటికి వచ్చారు. వివాహం చేసుకున్నారు. గర్భం దాల్చారు. ఒకానొక దశలో అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నారు.. కడుపులో పెరుగుతున్న బిడ్డ గుర్తుకురావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. కట్టుకున్నవాడు హింసిస్తుంటే ఓర్పుతోనే భరించారు. అత్తింటివారు వేధింపులకు గురి చేస్తుంటే పంటి బిగువన తట్టుకున్నారు.
మహారాష్ట్రలో పుట్టింది
ఆశా భోంస్లే మహారాష్ట్రలో సాంగ్లీలో 1933 సెప్టెంబర్ 8న పుట్టారు. ఆశా భోంస్లే సోదరి పేరు లతా మంగేష్కర్. ఉమా, మీనా అనే అక్క చెల్లెలు కూడా ఆశా భోంస్లే కు ఉన్నారు. హృదయనాద్ అనే సోదరుడు కూడా ఉన్నాడు. 9 సంవత్సరాల వయసులో ఆశ తన తండ్రిని కోల్పోయారు. కుటుంబ బాధ్యత మొత్తం లత మీద పడింది. అప్పట్లో ఆమె పాటలు పాడుతూ ఉండేది. అక్క పడుతున్న కష్టాన్ని చూడలేక ఆశ కూడా పాటలు పాడేది. చిన్నప్పటినుంచి ఆశ క్లాసికల్, గజల్, విరహం, విషాదం, రొమాంటిక్ పాటలు పాడేది. అవన్నీ కూడా ఆమెకు అలబోకగా వచ్చేశాయి. సుమారు 14 భాషలలో పాడారు ఆశ. వేలాది పాటలు ఆమె గాత్రం నుంచి వచ్చాయి. ఈమె పాడిన దమ్ మారో దమ్ పాట కొన్ని కోట్ల మందిని ఉర్రూతలూగించింది.
16 సంవత్సరాల వయసులో ఆశ లతా మంగేష్కర్ పిఎ.. 31 సంవత్సరాల వయసు ఉన్న గణపత్ రావ్ భోంస్లే ను వివాహం చేసుకున్నారు. దీని లత వద్దన్నారు. ఆశ చేసిన పనితో లత తీవ్రమైన కలతకు గురయ్యారు. చాలా సంవత్సరాలు పాటు తన సోదరుతో ఆమె మాట్లాడలేదు.. గణపత్ ఆశను పెళ్లి చేసుకున్న తర్వాత.. లతతో ఎటువంటి సంబంధాలు నడపకూడదని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ఆశను డబ్బు కోసం వేధించడం మొదలుపెట్టారు. ఆశను కోడలిగా గణపత్ కుటుంబం ఆమోదించలేదు. ఆశ గర్భిణిగా ఉన్నప్పుడు గణపత్ కుటుంబం ఆమెను ఇంట్లో నుంచి గెంటివేసింది. భర్త కూడా తీవ్రంగా కొట్టాడు. ఆ సమయంలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించాలని భావించింది ఆశ. ఒక బాటిల్ నిద్ర మాత్రలు మింగింది ఆశ. చివరికి ఆసుపత్రి పాలైంది. కోలుకున్న తర్వాత.. కొద్దిరోజులు ఒంటరి జీవితాన్ని గడిపింది. చివరికి 1960లో తన భర్త నుంచి విడిపోయింది.