Hari Hara Veeramallu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో(Telugu Film Industry) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) కి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న హీరోలందరికంటే కూడా తెలుగులో భారీ ఎత్తున క్రేజ్ ను సంపాదించుకున్న ఒకే ఒక హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే కావడం విశేషం…ఆయన చేసిన సినిమాల ద్వారా కొంతమంది ఆయనకు అభిమానులుగా మారితే, ఆయన చేసే సేవా కార్యక్రమాల ద్వారా చాలా ఎక్కువ మంది అతని అభిమానులుగా మారడమే కాకుండా ఆయన కోసం ప్రాణాలు ఇచ్చే భక్తులుగా కూడా మారిపోయారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక ఇలాంటి క్రమంలో ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎం(Deputy CM)గా పదవీ బాధ్యతలను కూడా సాగిస్తూనే ఇటు సినిమాలను కూడా తెరకెక్కిస్తూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో చాలా రోజుల నుంచి హరిహర వీరమల్లు( Hari Hara Veramallu) సినిమాకు సంబంధించిన ‘మాట వినాలి గురుడ మాట వినాలి ‘ అనే సాంగ్ గత కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ముఖ్యంగా ఈ పాటను పవన్ కళ్యాణ్ పాడడం అనేది ఇప్పుడు హైలైట్ గా నిలిచింది. ‘మాట వినాలి గురుడా మాట వినాలి’ అంటూ సాగే ఈ పాటను పవన్ కళ్యాణ్ చాలా అద్భుతంగా పాడడమే కాకుండా చాలా సంవత్సరాల తర్వాత మరోసారి తన గాత్రంతో సినిమా పాట పాడి దాని మీద హైప్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు.
ఇంతకుముందు ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ‘కాటమరాయుడా కదిరి నరసింహుడా’ అనే పాట పాడిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఈ సాంగ్ పాడడం విశేషం…ఇక ఈ సాంగ్ కి ముందు పవన్ కళ్యాణ్ తెలంగాణ స్లాంగ్ లో చెప్పిన డైలాగులు కూడా అదనపు ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ఈ పాట లో డప్పు పట్టుకొని ఆయన డప్పు కొట్టడం ఏ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకుండా చాలా ఫ్రెష్ గా పాట చేయాలనే ఉద్దేశ్యంతోనే ఇలాంటి ఒక వైఖరిని పాటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో మ్యూజిక్ ఇన్స్టు మెంట్స్ ఏమీ వాడకుండా జస్ట్ డప్పుతోనే పాటను పాడడం వల్ల అదొక కొత్త ఫ్రెష్ ఫీల్ అయితే ఇస్తుంది.
కాబట్టి పవన్ కళ్యాణ్ పాడిన పాటలు స్వచ్చమైన ఒక పల్లే ఫీల్ ను అయితే ఇస్తుంది ఆ పాట విన్న ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది…మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా మీద పవన్ కళ్యాణ్ కూడా భారీ ఆశలైతే పెట్టుకున్నాడు. ఇక తొందరలోనే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఆయన చాలా వరకు ప్రయత్నమైతే చేస్తున్నారు…
ఇక ఈ సాంగ్ లో సునీల్, సుబ్బరాజు, రఘుబాబు లాంటి వారు కూడా పవన్ కళ్యాణ్ తో కలిసి చిందేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనే దాని మీదే ఇప్పుడు మెగా అభిమానులు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…
