Sankranti Festival Movies : సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంటున్న స్టార్ హీరోలు…పోటీకి సిద్ధం అంటున్న యంగ్ హీరోలు…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు తమ సినిమాకి భారీ కలెక్షన్లు రావాలనే ఉద్దేశ్యంతో సినిమా రిలీజ్ ని ఫెస్టివల్ సమయంలో ప్లాన్ చేస్తూ ఉంటారు. దాని ద్వారా ఎక్కువ మంది సినిమా చూడడానికి ఆసక్తి చూపించడమే కాకుండా పాజిటివ్ టాక్ వస్తే మాత్రం సినిమా భారీ కలెక్షన్లను రాబడుతుందనే ఉద్దేశంతోనే వాళ్ళు సినిమాలు చేస్తూ ఉంటారు...

Written By: Gopi, Updated On : October 24, 2024 5:53 pm

Sankranti Festival Movies

Follow us on

Sankranti Festival Movies : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి ఫెస్టివల్ ను బేస్ చేసుకొని చాలా సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతూ ఉంటాయి. ఇక 2025 సంక్రాంతి కానుకగా బరిలోకి దిగే సినిమాల విషయంలో చాలా రోజుల నుంచి చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. మొత్తానికైతే రామ్ చరణ్ జనవరి 10వ తేదీన తన గేమ్ చేంజర్ సినిమాతో సంక్రాంతి బరిలో నిలుస్తున్నట్టుగా అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ఇక దాంతో విశ్వంభర సినిమాను చిరంజీవి పోస్ట్ పోన్ చేసుకున్న విషయం కూడా మనకు తెలిసిందే ఇక ఇది ఇలా ఉంటే బాలయ్య బాబు, బాబీ డైరెక్షన్ లో వస్తున్న ఎన్ బి కే 109 సినిమాని కూడా సంక్రాంతి బరిలో నిలపడానికి సిద్ధమవుతున్నారు. ఇక ప్రస్తుతానికైతే సంక్రాంతి రేసులో ఈ రెండు పెద్ద సినిమాలు ఉండడం విశేషం… కార్తికేయ 2 సినిమా తో మంచి గుర్తింపును సంపాదించుకున్న చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా వస్తున్న తండేల్ సినిమా కూడా సంక్రాంతి రేసులో ఉంటుందని ప్రచారం చేసినప్పటికి ప్రస్తుతం అయితే ఆ సినిమాని సంక్రాంతి బరి నుంచి తప్పించినట్టుగా తెలుస్తోంది. మరి కారణం ఏంటి అనే విషయం పక్కన పెడితే ఇప్పుడు సంక్రాంతి రేస్ లో ఆ సినిమా లేకపోవడం విశేషం…

ఇక దీంతోపాటుగా వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది అంటూ చాలా రోజుల నుంచి చాలా వార్తలైతే వినిపిస్తున్నాయి. కానీ ఆ సినిమా కూడా అనుకోని పరిస్థితుల్లో పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక గేమ్ చేంజర్ సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజు కావడంతో దాదాపు 80% థియేటర్ తన అధీనంలోనే ఉన్నాయి. కాబట్టి మిగతా హీరోలకు పెద్దగా థియేటర్లు దొరక్కపోవచ్చు అనే ఉద్దేశ్యంతోనే వాళ్ళు సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్టుగా కూడా తెలుస్తోంది.

కానీ బాలయ్య బాబు మాత్రం ముందుగా ఫిక్స్ అయినట్టుగా సంక్రాంతికి తన సినిమాను బరి లో నిలపాలని చూస్తున్నాడు. ఇక స్టార్ హీరోల సినిమాలు సైడ్ అయిపోవడంతో యంగ్ హీరో అయిన సందీప్ కిషన్ త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో చేస్తున్న ‘మజాకా’ సినిమా సంక్రాంతి రేసులో నిలవబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ ని తెరకెక్కించే త్రినాధ్ రావు నక్కిన డైరెక్షన్ లో సందీప్ కిషన్ చేస్తున్న ఈ సినిమా కూడా భారీ సక్సెస్ ని సాధిస్తుందంటూ సినిమా యూనిట్ చాలా మంచి కాన్ఫిడెంట్ ను అయితే వ్యక్తం చేస్తున్నారు.

ఇక చిన్న సినిమా అయినా కూడా పాజిటివ్ టాక్ వచ్చిందంటే సినిమాకి మంచి బజ్ క్రియేట్ అవుతుంది కాబట్టి సందీప్ కిషన్ ఈ సినిమా మీద తన పూర్తి నమ్మకాన్ని ఉంచి దీనిని సంక్రాంతి రేసులో నిలపడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమాలే కాకుండా సంక్రాంతి రేసులో మరిన్ని సినిమాలు నిలుస్తాయా లేదా అనేది…