https://oktelugu.com/

Amritha Aiyer: అల్లు అర్జున్ తో పాటు సమంత కూడా ఇష్టం అట !

Amritha Aiyer: అమృతా అయ్యర్ నేటి తరంలో మంచి అభినయం ఉన్న తార. కానీ, అదృష్టమే లేదు. ఇప్పటికే తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించినా అవకాశాలు మాత్రం రావడం లేదు. ‘రెడ్’, ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ వంటి చిత్రాల్లో చాలా బాగా నటించింది. పైగా ఈ భామ కనిపించగానే యూత్ కూడా ఈలలు కేకలతో గోల గోల చేశారు. అయితే, ప్రస్తుతం ఈ భామ నటించిన కొత్త సినిమా ‘అర్జున ఫల్గుణ’. హీరో శ్రీ […]

Written By:
  • Shiva
  • , Updated On : December 23, 2021 / 04:39 PM IST
    Follow us on

    Amritha Aiyer: అమృతా అయ్యర్ నేటి తరంలో మంచి అభినయం ఉన్న తార. కానీ, అదృష్టమే లేదు. ఇప్పటికే తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించినా అవకాశాలు మాత్రం రావడం లేదు. ‘రెడ్’, ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ వంటి చిత్రాల్లో చాలా బాగా నటించింది. పైగా ఈ భామ కనిపించగానే యూత్ కూడా ఈలలు కేకలతో గోల గోల చేశారు. అయితే, ప్రస్తుతం ఈ భామ నటించిన కొత్త సినిమా ‘అర్జున ఫల్గుణ’.

    Amritha Aiyer

    హీరో శ్రీ విష్ణు సరసన ఈ సినిమాలో నటించింది అమృతా అయ్యర్. ఈ చిత్రం ఈ నెలాఖరున విడుదల కాబోతుంది. మరి ఈ సినిమాతోనైనా అమృతా అయ్యర్ కి కాలం కలిసి వస్తోందా ? అనేది చూడాలి. ఇక ఈ తమిళ ముద్దుగుమ్మ మాత్రం తెలుగు ప్రేక్షకులను మాత్రమే నమ్ముకుందట. అందుకే, తెలుగు కూడా నేర్చుకుంది. ప్రస్తుతం తెలుగులోనే డైరెక్ట్ ఇంటర్వ్యూలు ఇస్తోంది.

    మీరు తెలుగులో బాగా మాట్లాడుతున్నారు ? ఎలా సాధ్యం అయింది అని అడిగితే ? “సినిమాల్లోకి వచ్చాకే నాకు తెలుగు నేర్చుకోవాలి అనిపించింది. అందుకే కష్టపడి నేర్చుకున్నాను. అయితే, ఈ నేర్చుకునే సమయంలో నేను తెలుగుతో ప్రేమలో పడిపోయాను. ఇక తెలుగు ఎలా నేర్చుకున్నాను అంటే.. నేను తెలుగు సినిమాలు ఎక్కువగా చూశాను. ఇంకా చూస్తున్నాను కూడా అని చెప్పింది.

    Also Read: Pushpa Collections: బాక్సాఫీస్ : ‘పుష్ప’ 6 రోజుల కలెక్షన్స్ !

    ఇక తనకు ఇష్టమైన తెలుగు నటీనటుల గురించి మాట్లాడుతూ.. ‘నాకు హీరోల్లో అల్లు అర్జున్, హీరోయిన్స్ లో సమంత అంటే ఎంతో ఇష్టం’ అంటూ చెప్పుకొచ్చింది అమృతా అయ్యర్. తనకు ఇంట్రెస్ట్ ఉన్న పాత్రల గురించి అడిగితే.. ఫలానాది అని ఏమి షరతులు పెట్టుకోలేదట. అలాగే నేను పక్కింటి అమ్మాయిలా ఉంటాను కాబట్టి.. అలాంటి పాత్రలు మాత్రమే చెయ్యాలని కూడా అనుకోవడం లేదని తెలిపింది.

    ఇక ప్రస్తుతం తెలుగు సినిమాలపైనే ఈ బ్యూటీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ‘అర్జున ఫల్గుణ’తో పాటు మరో మూడు తెలుగు సినిమాల్లో కూడా నటిస్తోందట.

    Also Read: 2021 మ్యూజికల్ రివ్యూ : టాలీవుడ్ మ్యూజికల్ హిట్స్

    Tags