https://oktelugu.com/

TMC Recruitment 2021: టీఎంసీలో 175 ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.53,100 వేతనంతో?

TMC Recruitment 2021: టాటా మెమోరియల్ సెంటర్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 175 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. వారణాసిలోని హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్ లో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి నెల 8వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://tmc.gov.in/index.php/en/ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 23, 2021 / 04:35 PM IST
    Follow us on

    TMC Recruitment 2021: టాటా మెమోరియల్ సెంటర్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 175 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. వారణాసిలోని హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్ లో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి నెల 8వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

    TMC Recruitment 2021

    https://tmc.gov.in/index.php/en/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 30 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు కాగా సంబంధిత పనిలో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ, డిప్లొమా ఇన్ ఆంకాలజీ, బీఎస్సీ(నర్సింగ్) పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    Also Read: స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. భారీ వేతనంతో?

    రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులకు 44,900 రూపాయల నుంచి 53,100 రూపాయల వరకు వేతనం లభించనుంది. 2022 సంవత్సరం జనవరి 8వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. 2022 సంవత్సరం జనవరి 15 హార్డ్ కాపీలను పంపడానికి చివరి తేదీగా ఉంది.

    సంస్థ ఉత్తరప్రదేశ్ అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాలి. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. https://tmc.gov.in/index.php/en/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెపవచ్చు.

    Also Read: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో జాబ్స్.. భారీ వేతనంతో