Bigg Boss 6 Telugu- Arjun Kalyan: ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ టాస్కుని ఇంటి సభ్యులు సరిగా ఆడకపోవడం వల్ల బిగ్ బాస్ ఈ వారం కెప్టెన్సీ టాస్కుని రద్దు చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..కెప్టెన్సీ టాస్కు రద్దు అవ్వడం తో ఇంటి సభ్యులందరికి చాలా కఠినతరమైన టాస్కులను పెడుతున్నాడు బిగ్ బాస్..దానితో ఈ వారం బిగ్ బాస్ హౌస్ మొత్తం వాడివేడిగా సాగింది..చాలా కాలం నుండి సరైన ఫైర్ కోసం ఎదురు చూస్తున్న బిగ్ బాస్ వీక్షకులకు మంచి స్టఫ్ ఇచ్చారు హౌస్ మేట్స్.

అంతే కాకుండా ఈ టాస్కుల మూలంగా హౌస్ మేట్స్ లో ఉన్న కొత్త కోణాల్ని కూడా ఆవిష్కరించాడు బిగ్ బాస్..అలాంటి వారిలో ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది అర్జున్ కళ్యాణ్ గురించి..బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి అసలు ఇంట్లో ఉన్నాడా లేదా అనేంతలా అనిపించిన అర్జున్ కళ్యాణ్ వారం వారం కి తన ఆట తీరుని మార్చుకుంటూ ఇప్పుడు టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా చేరిపోయాడు.
మొదటి నుండి కూల్ గా అర్జున్ ఫిజికల్ టాస్కులు వస్తే మాత్రం చెలరేగిపోయి ఆడేవాడు..ఎంత గొడవ వాతావరణం ఉన్నప్పటికీ కూడా చాలా కూల్ గా డీల్ చేసేవాడు..అయితే ఈ వారం అర్జున్ కళ్యాణ్ తనలోని ఫైర్ ని బయటకి తీసాడు..తన ఆట ని ఎలా అయితే ఆడాలి అనుకున్నాడో అదే రేంజ్ లో ఆడుతున్నాడు..ఒక్కమాట లో చెప్పాలంటే తనకంటే మించి ఎవ్వరు ఆడలేరు అనేంతలా రెచ్చిపొయ్యి ఆడుతున్నాడు..ఎంతలా అంటే ఆట కోసం తన స్నేహితుడు రేవంత్ తో కూడా గొడవలకు దిగిపోయాడు..అంతే కాకుండా మొదటి నుండి శ్రీ సత్య చుట్టూ తిరుగుతున్నాడు..తన గేమ్ మొత్తం పాడుచేసుకుంటున్నాడు అనే మాట నుండి బయటపడిపోయాడు.

ముఖ్యంగా ఈరోజు జరిగిన టాస్కులో అయితే ఆట రూల్స్ ని అతిక్రమించకుండా..అడ్డు వచ్చిన వారిని నిలువరిస్తూ చాలా చక్కగా ఆడాడు..ముఖ్యం గా తన ఫ్రెండ్ జోన్ లో ఉన్న రేవంత్ , శ్రీహన్ లతో వాగ్వాదానికి దిగిపోయాడు..ఇదే రేంజ్ అర్జున్ చివరి వరుకు ఆడితే కచ్చితంగా అతడు టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు.