ఆ రకంగా రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ దిగింది అరియానా. మాట ఇచ్చినట్టుగానే అరియానాని ప్రమోట్ చేస్తూ.. ఆమె వార్తల్లో నిలిచేలా వర్మ తన ప్రమోషన్ల జిమ్మిక్కులను బాగానే వాడాడు. ఐతే, అరియానా పర్సనల్ లైఫ్ కి సంబంధించి తెగ ఫీల్ అయిందని.. ఆమె గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి చక్కర్లు కొడుతోంది.
ఈ కొత్త భామ ఎప్పుడో ప్రేమలో పడిందట. ‘బిగ్ బాస్’లోకి అడుగు పెట్టక ముందే అరియానా ఒక ఎన్నారైతో డేటింగ్ లో ఉందని, ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. ప్రస్తుతం అరియానా బాయ్ ఫ్రెండ్ ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నాడట. అయితే, వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ, అలాగే పరిధి దాటిన ప్రశ్నలు తన బాయ్ ఫ్రెండ్ ఎలా రిసీవ్ చేసుకుంటాడో అని అరియానా తెగ టెన్షన్ పడిందట.
కానీ, అరియానా బాయ్ ఫ్రెండ్ మాత్రం ఆ ఇంటర్వ్యూను చాల లైట్ తీసుకున్నాడని, నువ్వు ఏమి చేసినా నాకు ఇష్టమే అంటూ అతగాడు అరియానాకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడట. ఏది ఏమైనా, ఈ అమ్మడికి ఫుల్ పర్మిషన్స్ ఇస్తే.. ఇక కామ్ గా ఎందుకు ఉంటుంది. అందుకే రానున్న రోజుల్లో మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కువ అటెన్షన్ పొందడానికి ఇంకేం చేస్తోందో చూడాలి.