Bigg Boss OTT Telugu Ariyana Glory: తెలుగు ప్రేక్షకులను మరోసారి ఎంటర్టైన్మెంట్ తో ముంచెత్తడానికి బిగ్ బాస్ నాన్ స్టాప్ వచ్చేసింది. OTT ప్లాట్ ఫాం డిస్నీ హాట్ స్టార్ 24×7 నాన్ స్టాప్ ఎంటర్మైన్మెంట్ పేరుతో దీనిని ప్రసారం చేస్తోంది. శనివారం పూట బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున అట్టహాసంగా ప్రారంభించిన బిగ్ బాస్ నాన్ స్టాప్ అందరినీ అలరిస్తు ముందుకు సాగుతోంది. మొత్తానికి బిగ్ బాస్ నాన్ స్టాప్ లో తొలివారం నామినేషన్స్ ముగిశాయి.

మొదటివారం ఇంటి నుండి ఎవరు బయటకు వెళ్లిపోతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే తొలివారంలో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు ఎమినేషన్ లో ఉన్నారు. అందులో అరియానా గ్లోరి, నటరాజ్ మాస్టార్, ముమైత్ ఖాన్, హమీదా ఖాతూన్, సరయు, మిత్రా శర్మ, ఆర్జే చైతులు ఉన్నారు. వీరిలో ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వారు ఎలిమినేషన్ నుండి సేవ్ అవుతారు. దీంతో తమ అభిమాన కంటెస్టెంట్లను ఎలిమినేషన్ నుండి కాపాడుకోవడానికి జనాలు ఓటింగ్ కు రెడీ అయిపోయారు.
Also Read: సాహో’ ఫలితం పై ప్రభాస్ కామెంట్స్ వైరల్
అయితే ఇప్పటి వరకు వచ్చిన ఓటింగ్ సరళి అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ముందు నుండి పాజిటివ్ వైబ్ తో ముందుకు సాగుతున్న అరియానాకు ఊహించని స్థాయిలో 43.5శాతం ఓట్లు వచ్చాయి. అరియానా బిగ్ బాస్ లో ఆడపులి అన్నట్లుగా జనాలు ఓటింగ్ వేశారు. అరియానా తర్వాత ఆర్జే చైతుకి 13శాతం ఓట్లు వచ్చాయి. తర్వాత 11.5శాతం ఓట్లతో హమీదా మూడో స్థానంలో నిలిచింది.

ఇక నాలుగో స్థానంలో నటరాజ్ మాస్టర్ 11 శాతం ఓట్లు పొందాడు. ఇక సరయు ఐదో స్థానంలో కొనసాగుతుంది. సరయుకి ఇప్పటివరకు 10.5 శాతం ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత స్థానంలో ముమైత్ ఖాన్ కొనసాగుతుంది. ముమైత్ కి ఇప్పటివరకు 8 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక చివరి స్థానంలో మిత్రా శర్మా కొనసాగుతోంది. మిత్రా శర్మా కి ఇప్పటివరకు 6 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
Also Read: సుడిగాలి సుధీర్ కు మళ్లీ పెళ్లి.. ఈసారి ఆ కొత్త అమ్మాయి ఎవరో తెలుసా?