https://oktelugu.com/

Ariyana Glory : అరియానా అరాచకం.. ఫోటోలు వైరల్

ఈటీవీ, మా టీవీ, జీటీవీల్లో ప్రసారమయ్యే ప్రత్యేక షో స్ లో అరియానా కనిపించి సందడి చేస్తుంటారు. ప్రస్తుతం నిర్వహించిన ఫోటోషూట్ ఆమె అందంలో మరో కోణాన్ని ఆవిష్కరించింది. ఆ ఫోటోలతో కుర్ర కారు మతులు పోతున్నాయంటే అతిశయోక్తి కాదు.

Written By:
  • NARESH
  • , Updated On : March 3, 2024 / 10:04 PM IST
    Follow us on

    Ariyana Glory : బిగ్ బాస్ షోలో ఒక్కసారి పాల్గొనడాన్నే కంటెస్టెంట్లు అదృష్టంగా భావిస్తుంటారు. కానీ అరియానా రెండుసార్లు బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొన్నారు. ఆ షో లో తన చలాకితనంతో సందడి చేశారు. గెలుపు, ఓటమిని పక్కన పెడితే ఆ షో లో తనదైన ఆట తీరు ప్రదర్శించారు. మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు.. కెరియర్ ప్రారంభంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో అరియానా యాంకర్ గా పని చేశారు. బుల్లితెరపై కూడా మెరిశారు. అప్పట్లో రామ్ గోపాల్ వర్మతో చేసిన ఒక ఇంటర్వ్యూ అరియానా కెరియర్ ను మలుపు తిప్పింది. ఆ ఇంటర్వ్యూ వల్లే ఆమెకు బిగ్ బాస్ లో అవకాశం వచ్చిందనే టాక్ అప్పట్లో వినిపించింది.

    బిగ్ బాస్ షో లో రెండుసార్లు అరియానా పాల్గొన్నారు. అప్పట్లో ఆమె ఆడిన ఆట చాలామంది వీక్షకులకు నచ్చింది. అందుకే టాప్ 5 కంటెస్టెంట్లలో అరియానా నిలిచారు. దీంతో ఒక్కసారిగా ఆమె రేంజ్ మారిపోయింది. ఫలితంగా రాజ్ తరుణ్ అనే యువ నటుడితో అనుభవించు రాజా సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా హిట్ అయి ఉంటే అరియానా రేంజ్ ఎక్కడికో వెళ్లి ఉండేది. కానీ ఆ సినిమా ఫ్లాప్ కావడంతో ఆమె ఆశలు అడియాసలయ్యాయి. ఇక అరియానా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఆమెకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తనను అనుసరించే వారితో పంచుకుంటారు. వివిధ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ అందమైన ప్రదేశాల ఫోటోలు తీసి సోషల్ మీడియా ద్వారా అరియానా పంచుకుంటారు. ముఖ్యంగా బిగ్ బాస్ బృందంతో అప్పుడప్పుడు కలిసి సందడి చేస్తుంటారు. దానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.

    సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అరియానా.. ఫోటోషూట్లతో అలరిస్తుంటారు. అయితే అందులో అందం పాళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆమె దిగే ఫోటోలను యువత ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇక ఇటీవల ఆ తరహాలోనే అరియానా ఫోటోలు దిగారు.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.. యువత ఆ ఫోటోలు చూసి ఫిదా అవుతున్నారు. అందమంటే నీదే అంటూ కామెంట్లు చేస్తున్నారు. బుల్లితెరపై కూడా అరియానా కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈటీవీ, మా టీవీ, జీటీవీల్లో ప్రసారమయ్యే ప్రత్యేక షో స్ లో అరియానా కనిపించి సందడి చేస్తుంటారు. ప్రస్తుతం నిర్వహించిన ఫోటోషూట్ ఆమె అందంలో మరో కోణాన్ని ఆవిష్కరించింది. ఆ ఫోటోలతో కుర్ర కారు మతులు పోతున్నాయంటే అతిశయోక్తి కాదు.