https://oktelugu.com/

Spirit movie : స్పిరిట్ మూవీ లో ప్రభాస్ మేకోవర్ కోసం అన్ని కోట్లు ఖర్చుపెడుతున్నారా..?

ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, కల్కి సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఈ ఇయర్ లోనే రిలీజ్ అవ్వబోతున్నట్టు గా తెలుస్తుంది...

Written By:
  • Gopi
  • , Updated On : February 5, 2024 / 10:25 PM IST

    Spirit

    Follow us on

    Spirit movie : కొంతమంది దర్శకులు చేసినవి చాలా తక్కువ సినిమాలైనా కూడా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. అలాంటి దర్శకుల నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఆ సినిమా కోసం ప్రతి ప్రేక్షకుడు కూడా చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక అలాంటి దర్శకులలో మన సందీప్ రెడ్డి వంగ ఒకరు. తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ సక్సెస్ కొట్టి ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన సందీప్. ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా వరుసగా రెండు సినిమాలు చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు.

    ఇక రీసెంట్ గా రన్బీర్ కపూర్ తో చేసిన అనిమల్ సినిమాతో అయితే పాన్ ఇండియాలో ఒక పెను సంచలనాన్ని సృష్టించాడనే చెప్పాలి. ఇక ఈ సినిమా దాదాపు 900 కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబట్టి సందీప్ రెడ్డి వంగ పేరుని ఇండియా వైడ్ గా వినిపించేలా చేసింది. ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈయన ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తొందర్లో సెట్స్ మీదికి వెళ్ళనున్న నేపథ్యంలో ఇందులో ప్రభాస్ మేకోవర్ కోసం దాదాపు 5 కోట్ల వరకు ఖర్చుపెట్టనున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఇంతకుముందు ఎప్పుడు మనం చూడని విధంగా ఒక కొత్త మేకవర్ లో ప్రభాస్ ను చూపించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక దీనికోసమే భారీగా ఖర్చు చేస్తున్నట్టుగా కూడా సినిమా యూనిట్ నుంచి వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమాతో సందీప్ మరోసారి సాలిడ్ హిట్టు కొట్టాలని చూస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి.

    ఇక ఇప్పటివరకు ప్రభాస్ ని ఎవరు చూపించిన విధంగా చూపిస్తాను అంటూ ప్రభాస్ అభిమానులకి మాట ఇచ్చిన సందీప్ రెడ్డివంగ ఆ మాట నిలబెట్టుకొని, ప్రభాస్ కి మరొక భారీ హిట్ అందిస్తాడా లేదా అనేది చూడాలి. ఇక ఇది ఇలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, కల్కి సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఈ ఇయర్ లోనే రిలీజ్ అవ్వబోతున్నట్టు గా తెలుస్తుంది…