Kalki 2898 AD – Kamal Haasan: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో కల్కి సినిమాలో కమలహాసన్ విలన్ గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనే దానికి సంబంధించిన ఒక హింట్ కూడా ఇప్పటివరకు అయితే ఇవ్వలేదు. ఇక కల్కి సినిమా నుంచి ఒక గ్లింప్స్ ని వదిలినప్పటికీ ఆ గ్లింప్స్ లో ఆయన కనిపించిన దాఖలు లేవు.
ఇక ఇదిలా ఉంటే జూన్ 27వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. కాబట్టి ఈ సినిమా మీద హైప్ ని పెంచడానికి ఇప్పుడు తీవ్రమైన కసరత్తులు చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే కమలహాసన్ కు సంబంధించిన ఒక టీజర్ ని రెడీ చేసి దాన్ని రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యం లో సినిమా మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఆ టీజర్ ని కనక మనం చూసినట్లయితే దాంట్లో కమలహాసన్ కంప్లీట్ క్యారెక్టరైజేశన్ ఏంటి అనేది మనకు తెలిసిపోతుంది అంటూ ఈ విధంగా చాలా కొత్తగా ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి…అయితే ఇప్పటివరకు ఏ పెద్ద సినిమాలో కూడా విలన్ కు సంబంధించిన టీజర్ ను అయితే ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. కానీ ఇప్పుడు సరికొత్తగా నాగ్ అశ్విన్ ఇలా విలన్ కి సపరేట్ టీజర్ ను రిలీజ్ చేసి ఒక మంచి గుర్తింపును తెచ్చుకోబోతున్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది.
ఇక మొత్తానికైతే ఈ సినిమాతో భారీ కలెక్షన్స్ ను రాబట్టి అన్ని రికార్డులను బ్రేక్ చేయడమే లక్ష్యం గా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక పాన్ ఇండియాలో కూడా ఈ సినిమా క్రేజ్ మామూలుగా లేదు. ఇక ఈ సినిమా చేసే సమయానికి మాత్రం ఈ సినిమా మీద హైప్ అనేది విపరీతంగా క్రియేట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. చూడాలి మరి ఈ సినిమాతో వీళ్ళు ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు అనేది…