2026 Sankranti Movies: సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది.ఇక ఇదే సమయాన్ని క్యాష్ చేసుకోవడానికి సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు ముందుంటుంది. సంక్రాంతికి వచ్చే సినిమాలు అంటేనే ప్రతి ఒక్కరిలో పండగ వాతావరణం నెలకొంటుంది. ఇక సంక్రాంతికి స్టార్ హీరోలు సైతం సినిమాలను రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. కారణం ఏంటి అంటే అప్పుడు రిలీజ్ చేస్తే సినిమాలకు భారీ కలెక్షన్స్ వస్తాయి. ఫ్యామిలీ ఆడియెన్స్ మొత్తం ఆ సినిమాలు చూడడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశ్యంతోనే సంక్రాంతి బరిలో చాలామంది హీరోలు నిలుస్తుంటారు. ఇక ఇప్పటికే చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాని సంక్రాంతికి తీసుకొస్తున్నారు. ఇక మారుతి డైరెక్షన్లో వస్తున్న ‘రాజాసాబ్ ‘ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. రవితేజ చేస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా’ అనే మూవీస్ సంక్రాంతికి వస్తున్నాయి. అయితే ఈ సినిమాలతో పాటుగా మరికొన్ని సినిమాలు కూడా సంక్రాంతి బర్రిలో నిలిచే అవకాశాలైతే ఉన్నాయి. ప్రస్తుతం ఈ నాలుగు సినిమాల విషయానికి వస్తే వీటన్నింటికీ థియేటర్లు దొరికే అవకాశాలు ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి. ఎందుకంటే చిరంజీవి, ప్రభాస్ సినిమాలకే ఎక్కువ థియేటర్లను కేటాయిస్తున్నారు. కాబట్టి మిగతా వాళ్ళకు థియేటర్లు భారీ ఎత్తున దొరికే అవకాశమైతే లేదు.
నిజానికి సంక్రాంతి బరి నుంచి భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా రెండు సినిమాలు తప్పుకునే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక మరి కొంతమంది హీరోలు సైతం సంక్రాంతికి వస్తే బాగుండు అని ఆలోచిస్తున్నారట. నిజానికి సంక్రాంతికి వస్తే ఎంత ప్లస్ ఉందో అంత మైనస్ కూడా ఉంది.
కారణం ఏంటి అంటే సక్సెస్ ఫుల్ టాక్ వస్తే ప్రేక్షకులందరు సినిమాని చూస్తారు. కానీ ఒకవేళ ప్లాప్ టాక్ వస్తే మాత్రం ప్రేక్షకులు దాన్ని పట్టించుకోరు. ఎందుకంటే ఆల్టర్ నెట్ గా మరికొన్ని సినిమాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలను చూడడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు తప్ప ప్లాప్ సినిమాలను చూడడానికి ఎవరు సాహసించరు…
ఒకరకంగా సంక్రాంతికి వచ్చే సినిమాల విషయంలో చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడాలు ఉండవు. కానీ సక్సెస్ ఫుల్ సినిమానా, ఫ్లాప్ సినిమానా అనే తేడాలు మాత్రమే ఉంటాయి. ఇక ఇదంతా కాకుండా కండక్కి గుంపులో గోవింద లా కాకుండా సోలో గా వస్తే మంచి కలెక్షన్స్ సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయని పలువురు సినిమా మేధావులు సైతం సలహాలైతే ఇస్తున్నారు…