Prabhas upcoming films: యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నటుడు ప్రభాస్…ప్రస్తుతం ఆయన నుంచి వస్తున్న సినిమాలకు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ఉంది… ఇక ఇప్పటి వరకు ప్రభాస్ చేసిన పాన్ ఇండియా సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు రాబోతున్న సినిమాలతో మరోసారి తనను తాను స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాల బడ్జెట్ భారీ గా పెరిగిపోవడం తో ఈ రెండు సంవత్సరాల్లో ఆయన దాదాపు 4000 కోట్ల వరకు బడ్జెట్ ను కేటాయిస్తున్నారు. ఇక ఇప్పుడు ‘రాజాసాబ్’ సినిమా కోసం దాదాపు 500 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు.
ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది…ఇక హను రాఘవపూడి దర్శకత్వం లో చేస్తున్న ‘ఫౌజీ’ సినిమా సైతం 800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తుండటం విశేషం… ఇక ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో ‘స్పిరిట్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం దాదాపు 800 కోట్ల బడ్జెట్ ను కేటాయించినట్టుగా తెలుస్తోంది.
ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్ 2’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతోంది…ఇక కల్కి 2 సినిమాను సైతం 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తుండటం విశేషం… ఇక రాబోయే 2 సంవత్సరాల్లో ప్రభాస్ మీద దాదాపు 4000 కోట్ల బడ్జెట్ ను కేటాయించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…
ఇక ఈ సినిమాలతో ప్రభాస్ ఎన్ని వందల కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొడుతాడు అనేది తెలియాల్సి ఉంది… ఇక మిగతా హీరోలతో పోలిస్తే ప్రభాస్ సినిమాలకు ఇండియాలో ఆదరణ ఎక్కువ ఉండటం తో ఆయన మీద భారీ బడ్జెట్ పెట్టడానికి ప్రొడ్యూసర్స్ సైతం ముందుకు వస్తుండటం విశేషం…చూడాలి మరి రాబోయే 2 సంవత్సరాల్లో ప్రభాస్ ఎన్ని సక్సెస్ లను సాధిస్తాడు అనేది…