Indian Movies Fake collections: ఒక సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టడం అనేది మామూలు విషయం కాదు. అప్పటివరకు ఉన్న సినిమాలన్నింటిని బీట్ చేస్తూ ఒక కొత్త జానర్ లో సినిమాను చేసి ప్రేక్షకుడికి ఒక హై ఫీల్ ఇచ్చిన సినిమాలు మాత్రమే ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకుంటాయి. ఇక ప్రేక్షకులు రిపీటెడ్ గా ఆ సినిమాను చూసినప్పుడే దానికి కలెక్షన్స్ కూడా భారీ రేంజ్ లో వస్తాయి. అలా థియేటర్ కి ప్రేక్షకుడిని రిపీటెడ్ గా రప్పించాలి అంటే దానికి చాలా వరకు కసరత్తులైతే చేయాలి… ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది స్టార్ హీరోలు వాళ్ళు చేసిన సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించినప్పటికి అవి ఇండస్ట్రీ హిట్టుగా మారకపోయిన కూడా ఇండస్ట్రీ హిట్టు కొట్టింది అంటూ ఆ సినిమాను ప్రమోట్ చేసుకుంటుంటారు. కానీ ఇండస్ట్రీ హిట్టుగా మారలేదని విషయం అందరికి తెలుసు కానీ సామాన్య జనాలకి కొంతమందికి తెలియక వాళ్ళు అపోహ పడుతుంటారు. ముఖ్యంగా బాహుబలి 2 సినిమా 1800 కోట్లను రాబట్టింది. అవి జన్యున్ కలెక్షన్స్…
ఇక అప్పటివరకు 1700 కోట్ల కలెక్షన్స్ తో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న ‘దంగల్’ మూవీ రికార్డ్ ను బాహుబలి 2 సినిమా బ్రేక్ చేసింది కానీ దాన్ని జీర్ణించుకోలేని బాలీవుడ్ వాళ్ళు మళ్లీ ఆ సినిమాను ఇతర దేశాల్లో రిలీజ్ చేసి అది 2000 కోట్ల మార్కును దాటిందంటూ ఫేక్ కలెక్షన్స్ చూపించారు. తద్వారా ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్స్ ను వసూలు చేసిన సినిమాగా దంగల్ సినిమా నిలిచింది.
నిజానికి ఆ సినిమాకి అన్ని వందల కోట్లయితే రాలేదు. బాహుబలి 2 సినిమా మీద ఉన్న పోటీతో ఆ సినిమాని ఆడించే ప్రయత్నం చేశారు. అయినప్పటికి ఆ సినిమా బాహుబలిని బీట్ చేయలేకపోయింది. కానీ 2000 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టిందంటూ ఫేక్ కలెక్షన్స్ చూపించారు… ఇక అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘పుష్ప 2’ సినిమా పరిస్థితి కూడా ఇదే… బాహుబలి 2 ను బ్రేక్ చేయడానికి 1850 కోట్ల కలెక్షన్స్ వచ్చాయంటూ చెప్పారు. అలాగే బాహుబలి కి 1800 కోట్లు వస్తె మా పుష్ప 2 కి 1850 కోట్లు వచ్చాయి.
అంటే బాహుబలి కంటే 50 కోట్లు ఎక్కువగా వచ్చాయంటూ ప్రచారం చేసుకున్నారు… ఇక షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన ‘పఠాన్’ సినిమాకి సైతం 1200 కోట్లకు పైన కలెక్షన్స్ వచ్చాయంటు ఫేక్ కలెక్షన్స్ ని చూపించారు. ఒరిజినల్ గా ఈ సినిమాకు వచ్చింది 800 కోట్ల కలెక్షన్స్ అంటూ బాలీవుడ్ మీడియా సైతం కొన్ని కథలనైతే ప్రచురించింది…