Telugu top heroes list: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణ,వెంకటేష్,నాగార్జున లాంటి హీరోలు తమ సత్తా చాటుతూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లడంలో వీళ్ళు చాలావరకు కృషి చేశారు. వాళ్ళను భర్తీ చేయగలిగే హీరోలు ఇప్పుడున్న జనరేషన్లో ఎవరు ఉన్నారు అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి. టాప్ ఫోర్ గా వీళ్ళందరు ఒకప్పుడు చాలా మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం టాప్ ఫోర్ లో నిలిచే హీరోల పేర్లు చెప్పడం చాలా కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటులు ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ సిక్స్ హీరోలుగా కొనసాగుతున్నారు.
వీళ్ళందరు ఎవరి బాటలో వాళ్ళు సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. తద్వారా వీళ్లలో ఎవరు గ్రేట్, ఎవరు తక్కువ అని చెప్పలేము…ఒకప్పుడు చిరంజీవి అంటే అటు నటిస్తు ఇటు డాన్స్ లు బాగా వేస్తూ తన సత్తా చాటాడు. కాబట్టి అప్పుడున్న హీరోలెవ్వరికి అంత పెద్దగా డాన్స్ లైతే రాకపోవడం వల్ల చిరంజీవి అన్ని విషయాల్లో ఆరు తేరి ఉన్నాడనే ఉద్దేశ్యంతో అతన్ని మెగాస్టార్ గా ఇండస్ట్రీకి నెంబర్ వన్ హీరోగా ప్రకటించే అవకాశమైతే దక్కింది.
కానీ ఇప్పుడున్న హీరోలు మాత్రం ఒక్కొక్కరు సపరేట్ గా ఉన్నారు. అన్ని క్వాలిటీస్ కలిపి ఏ ఒక్క హీరోలో లేకపోవడం వల్ల వీళ్లలో ఎవరు నెంబర్ వన్ ఎవరు టాప్ హీరోలనేది చెప్పడం చాలా కష్టంతో కూడుకున్న పని అని సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…
ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో మన హీరోలు వాళ్ళ సత్తాను చాటుకుని టాప్ హీరోలుగా ఎదిగితే మాత్రం ఎవరినో ఒకరిని ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ప్రకటించే అవకాశమైతే ఉందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…