https://oktelugu.com/

Mokshagna Teja: మోక్షజ్ఞ రెండు, మూడు సినిమాలకు డైరెక్టర్లు ఫిక్స్ అయ్యారా..? బాలయ్య అసలు ఎక్కడ తగ్గడం లేదుగా…

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించాయి. ఇక ఇప్పుడు తన వారసుడు ఆయన మోక్షజ్ఞ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో ఆయన కూడా భారీ సక్సెస్ లను అందుకోవాలనే ఉద్దేశ్యంలో బాలయ్య బాబు భారీ ప్రణాళికలను రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది...

Written By:
  • Gopi
  • , Updated On : September 10, 2024 / 11:27 AM IST

    Mokshagna Teja

    Follow us on

    Mokshagna Teja: సినిమా ఇండస్ట్రీలో నట వారసులు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం అనేది సాధారణం గా జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ల తాతలు, తండ్రి హీరోలుగా కొనసాగిన తర్వాత వాళ్ళ వారసులు కూడా హీరోలుగా కొనసాగాలనే చూస్తూ ఉంటారు. అందులో ఎంత మాత్రం తప్పులేదు. ఇక కొంతమంది సినిమా ఇండస్ట్రీలో నెపోటీజం ఉంది అని ప్రచారం చేస్తున్నప్పటికీ, ఇక్కడ టాలెంట్ ఉన్నవాళ్లు మాత్రమే హీరోలుగా నిలబడుతారనేది వాస్తవం..ఇక ఇదిలా ఉంటే నందమూరి నటసింహమైన బాలయ్య బాబు కొడుకు మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈయన మొదటి సినిమాని ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో చేయడానికి కమిట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక మొదటి సినిమాతోనే భారీ సక్సెస్ సాధించాలని బాలకృష్ణ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొదటి సినిమా విషయం పక్కన పెడితే ఆయన తర్వాత చేయబోయే రెండు సినిమాలను కూడా బాలకృష్ణ రెడీ చేసి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రెండో సినిమా కోసం మాస్ డైరెక్టర్ అయిన బోయపాటి శ్రీను ను రంగం లోకి దింపబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇంకెప్పటికీ బోయపాటి శ్రీను మాస్ లో పెను ప్రభంజనాన్ని సృష్టించడం మనందరికీ తెలిసిందే.

    నిజానికి బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో మూడు సినిమాలు వచ్చి సూపర్ సక్సెస్ లను సాధించాయి. ప్రస్తుతం నాలుగో సినిమా కూడా రావడానికి సిద్ధమవుతుంది. బోయపాటి డైరెక్షన్ లో నటిస్తే కూడా అతనికి మంచి గుర్తింపు వస్తుందనే ఉద్దేశ్యంతోనే బాలయ్య ఇలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక మూడో సినిమా కోసం కామెడీ ఎంటర్ టైనర్ లను తెరకెక్కించి సక్సెస్ లను సాధించడంలో మంచి పేరు సంపాదించుకున్న అనిల్ రావిపూడి ని సెట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్య బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో భగవంత్ కేసరి అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాతో బాలయ్య బాబు ఒక మంచి సక్సెస్ ని సాధించడమే కాకుండా బాలయ్య బాబు ఏజ్ కి తగ్గ పాత్రను కూడా చాలా సక్సెస్ ఫుల్ గా పోషించాడనే చెప్పాలి.

    కాబట్టి అనిల్ రావిపూడి అయితేనే మోక్షజ్ఞలో ఉన్న కామెడీ అలాగే యాక్షన్ ని కూడా బయటకు తీస్తాడనే ఉద్దేశ్యంతో బాలయ్య ఈ కాంబినేషన్ ను కూడా సెట్ చేసి పెట్టినట్టుగా తెలుస్తోంది. మరి మోక్షజ్ఞ మొదటి సినిమా అవ్వడమే ఆలస్యం తదుపరి రెండు సినిమాలకు కూడా ముహూర్తం పెట్టేశాడు బాలయ్య… ఇక ఇప్పటివరకు మోక్షజ్ఞ ఎంట్రీ లో లేట్ అయింది. అయినప్పటికీ ఇకమీదట వచ్చే సినిమాల్లో మాత్రం అస్సలు లేట్ అవ్వకుండా చూసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది…